Begin typing your search above and press return to search.
IMAX ఫార్మాట్ లో పొన్నియిన్ సెల్వన్-1
By: Tupaki Desk | 17 Aug 2022 3:30 AM GMTదర్శక దిగ్గజం మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ పీరియాడికల్ మూవీ `పొన్నియిన్ సెల్వన్-1` సెప్టెంబర్ లో అత్యంత గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది.
2022 మోస్ట్ అవైటెడ్ జాబితాలో ఉన్న ఈ చిత్రం IMAX ఫార్మాట్ లో అందుబాటులోకి వస్తోందని టీమ్ ధృవీకరించింది. ఐమ్యాక్స్ ఫార్మాట్ లో మొదటి తమిళ చిత్రంగా పీఎస్ 1 నిలవనుంది. ఆ మేరకు లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా వివరాల్ని ప్రకటించింది.
IMAX ఫార్మాట్ లో విడుదలను ఖరారు చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో వివరాలను పంచుకుంది. ``గ్రాండ్ గెట్స్ గ్రాండ్! IMAXలో #PS1 అనుభూతిని పొందండి... IMAXలో విడుదలవుతున్న మొదటి తమిళ చిత్రమిది.. సెప్టెంబర్ 30న థియేటర్లలో వస్తోంది!`` అని వెల్లడించారు.
పొన్నియిన్ సెల్వన్ I అనేది అరుల్ మోజివర్మన్ (జయం రవి) చుట్టూ తిరిగే కథతో రూపొందింది. అతడు తిరుగుబాటుకు వ్యతిరేకంగా చోళ రాజ్య సింహాసనాన్ని అధిరోహించిన వైనం తెరపై ఆవిష్కరిస్తున్నారు. అయితే చోళుల మధ్య సందేశాలను అందించడానికి దక్షిణ రాజ్యాల గుండా ప్రయాణించే ఆదిత్య కరికాలన్ (విక్రమ్) అనే దూత వల్లవరైయన్ వంద్యదేవన్ (కార్తీ)ల దృష్టికోణంలో కథ కొనసాగుతుంది.
ఈ చిత్రంలో విక్రమ్ (ఆదిత్య కరికాలన్ గా) - కార్తీ (వంతీయతేవన్‌గా) నావల్టీ ఉన్న పాత్రల్లో నటించారు. జయం రవి టైటిల్ రోల్ ని పోషిస్తున్నారు. కుందవాయిగా త్రిష .. నందినిగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటిస్తున్నారు.
`కల్కి` నవల సిరీస్ ఆధారంగా ఈ సినిమాని మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం ..జయమోహన్ డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ మరో హైలైట్. ఐశ్వర్యలక్ష్మి- శోభితా ధూళిపాళ- ప్రభు- ఆర్ శరత్ కుమార్- విక్రమ్ ప్రభు- జయరామ్- ప్రకాష్ రాజ్- రెహమాన్- ఆర్ పార్థిబన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.