Begin typing your search above and press return to search.

ఆ తమిళ బాహుబలి ని ఎన్ని రోజుల్లో తీశారో తెలుసా!

By:  Tupaki Desk   |   21 Aug 2022 4:30 PM GMT
ఆ తమిళ బాహుబలి ని ఎన్ని రోజుల్లో తీశారో తెలుసా!
X
తమిళ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'పొన్నియిన్ సెల్వం'. తమిళ బాహుబలి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పొన్నియిన్ సెల్వం ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. ఈ సినిమా భారీ పౌరాణిక సినిమా. సుదీర్ఘ కాలంగా తమిళ సినీ ప్రముఖులను ఆకర్షిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది.

రెండు పార్ట్‌ లు గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ను చాలా తక్కువ సమయంలో పూర్తి చేశారట. రెండు పార్ట్‌ ల షూటింగ్‌ ను ముగించారని... రెండు పార్ట్‌ లకు కూడా కేవలం 140 రోజుల్లోనే షూటింగ్ ను ముగించినట్లుగా తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పేర్కొన్నారు.

హైదరాబాద్‌ లో జరిగిన సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో హీరో కార్తీ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. భారీ స్టార్‌ కాస్టింగ్ మరియు భారీ బడ్జెట్‌ సినిమా ఇంత తక్కువ రోజుల్లో అది కూడా రెండు పార్ట్ లకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అవ్వడం ఆశ్చర్యం. రాజమౌళి బాహుబలి సినిమా ను ఏకంగా నాలుగు అయిదు సంవత్సరాలు తీసిన విషయం తెల్సిందే.

పొన్నియిన్ సెల్వం పై అంచనాలు తమిళనాట భారీ ఎత్తున ఉన్నాయి. ప్రముఖ స్టార్స్ నటించడం వల్ల అక్కడ భారీగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. తెలుగు లో కూడా ఈ సినిమా ను ప్రముఖంగా విడుదల చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. కాని తెలుగు లో మాత్రం అంతగా బజ్ క్రియేట్‌ అవ్వడం లేదు. విడుదల తర్వాత అయినా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు నమోదు అయ్యేనో చూడాలి.