Begin typing your search above and press return to search.

ఆరెంజ్ బ్యూటీ.. సీక్రెట్ మ్యారేజ్??

By:  Tupaki Desk   |   20 Dec 2016 5:15 AM GMT
ఆరెంజ్ బ్యూటీ.. సీక్రెట్ మ్యారేజ్??
X
సినీ నటి పూజా ఉమాశంకర్ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరీ పూజా శంకర్ అని అర్ధం కావాలంటే.. రామ్ చరణ్ మూవీ ఆరెంజ్ సినిమాని ఓ సారి గుర్తు చేసుకోవాలి. హీరోయిన్ జెనీలియాకి ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ లో.. ఎస్ ఎం ఎస్ లతో ప్రేమించేసుకుని.. తర్వాత ఛీ కొట్టి వెళ్లిపోతుందే ఆ అమ్మాయే పూజ. ఎక్కువగా తమిళ్.. ఒక మలయాళంతో పాటు రెండు ఇంగ్లీష్ మూవీస్ లో కూడా నటించిన ఈ భామ.. ఎక్కువగా సింహళ భాషలో నటిస్తూ ఉంటుంది. ఇందుకు కారణం.. ఈమె తండ్రి శ్రీలంక వ్యక్తి కావడమే.

ఇదిలా ఉంటే.. పూజ పర్సనల్ వ్యవహారాలపై బోలెడన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈమె శ్రీలంకకు చెందిన బిజినెస్ మ్యాన్ కం మోడల్ కం యాక్టర్ అయిన దీపక్ షణ్ముగనాథన్ ను పెళ్లి చేసుకుందని వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారనే ప్రచారం ఉంది. అసలు.. వీళ్లకి రెండేళ్ల క్రితమే నిశ్చితార్ధం కూడా జరిగింది. ఒక టైం లో అయితే పెళ్లయిపోయిందనే ప్రచారం జరిగినా.. అవి రూమర్సే అని తేలిపోయాయి.

దీపక్ తో విబేధాలు వచ్చి ఎవరికి వారే అన్నట్లుగా ఉంటున్నారని ప్రచారం చాలాకాలం పాటు జరిగిన తర్వాత.. మళ్లీ వీళ్లిద్దరికీ సయోధ్య కుదిరిందట. తాజాగా ఈ ఆదివారం నాడు శ్రీలంక రాజధాని కొలంబోలో వీళ్లిద్దరూ రహస్య వివాహం చేసుకున్నారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/