Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : బర్త్ డే పార్టీలో లిరిల్ బ్యూటీ హంగామా..!

By:  Tupaki Desk   |   28 Oct 2022 4:30 PM GMT
ఫోటో స్టోరీ : బర్త్ డే పార్టీలో లిరిల్ బ్యూటీ హంగామా..!
X
మోడల్ గా కెరియర్ ప్రారంభించి 90వ దశకంలో యూత్ ఆడియన్స్ ని తన అందాలతో మెస్మరైజ్ చేసిన బ్యూటీ పూజా బత్రా. 1993లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ కూడా దక్కించుకున్న పూజా అప్పట్లో ఫేమస్ లిరిల్ సోప్ యాడ్ లో కూడా నటించి క్రేజ్ తెచ్చుకుంది. మోడల్ గా చేస్తూనే సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది.

ఆసై సినిమాలో గెస్ట్ అప్పియరన్ తో తెరంగేట్రం చేసిన పూజా తన సెకండ్ సినిమా తెలుగులో చేయడం విశేషం. కింగ్ నాగార్జున టబు నటించిన సిసింద్రీ సినిమాలో పూజా నటించింది.

ఆ టైం లోనే బాలీవుడ్ లో విశ్వవిధాత, భాయ్, విరాసత్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మళయాళ మూవీ చంద్రలేఖ ఛాన్స్ అందుకుంది అమ్మడు.

అప్పటి నుంచి సౌత్ సినిమాల్లో కూడా నటించింది పూజ బత్రా. హిందీలో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన పూజా తెలుగులో రెండు.. తమిళంలో 2, మళయాళంలో 3 సినిమాలు చేసింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే మోడలింగ్ మీద తన ఆసక్తిని కొనసాగించింది పూజా బత్రా. బాలీవుడ్ మోడలింగ్ క్వీన్ లలో పూజ బత్రా ఒకరు. ఆమె తన కెరియర్ లో దాదాపు 250 మోడలింగ్ ఈవెంట్స్ లో పాల్గొన్నట్టు సమాచారం.

అంతేకాదు 24 ఫ్యాషన్స్ షోస్ లో కూడా పూజా ర్యాంప్ వాక్ చేసినట్టు తెలుస్తుంది. పూజా బత్రా అనగనే అప్పట్లో అందరికి ఆమె చేసిన లిరిల్ యాడ్ గుర్తొచ్చేది. ఇక దానితో పాటుగా హెడ్ అండ్ షోల్డర్స్ కి ఇండియాలో మొదటి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు పూజా బత్రా.

ఇక లేటెస్ట్ గా తన బర్త్ డే పార్టీలో మరోసారి తన హాట్ లుక్స్ తో అలరించారు పూజా బత్రా. ఏజ్ బార్ బ్యూటీ అయినా గ్లామర్ షోలో తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ని మెయింటైన్ చేస్తూ వస్తుంది. పూజ బత్రా బర్త్ డే పార్టీలో బాలీవుడ్ కి సంబందించిన ప్రముఖులు కొందరు పాల్గొన్నారు. పార్టీలో బ్లాక్ అండ్ బ్లాక్ కాస్టూమ్ తో చూపరులను ఆకట్టుకుంటుంది పూజ. అప్పట్లో యూత్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించిన పూజ ప్రస్తుతం ఆసియా అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కి లైఫ్ మెంబర్ గా ఉన్నారు. పూజా బర్త్ డే పార్టీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.