Begin typing your search above and press return to search.

44లో హాటీ చెమ‌ట‌లు ప‌ట్టించే యోగా భంగిమ‌!

By:  Tupaki Desk   |   26 May 2021 6:30 AM GMT
44లో హాటీ చెమ‌ట‌లు ప‌ట్టించే యోగా భంగిమ‌!
X
యోగా అన‌గానే తొలిగా గుర్తుకు వ‌చ్చేది మ‌లైకా- శిల్పాశెట్టి లాంటి సీనియ‌ర్ భామ‌లు. కానీ ఇప్పుడు ఇలాంటి సీనియ‌ర్ల‌కు కూడా చెమ‌ట‌లు ప‌ట్టించేసే యోగా భంగిమ‌తో హాట్ టాపిక్ గా మారింది పూజా బాత్రా. ఏజ్ ఒక నంబ‌ర్ మాత్ర‌మేన‌ని ప్రూవ్ చేస్తూ 44 ఏజ్ లో పూజా బాత్రా హాట్ ఫోజుతో చెమ‌ట‌లెక్కిస్తోంది. ఈ ఏజ్ లో పూజా అలాంటి క‌ఠిన భంగిమ‌తో స‌ర్ ప్రైజ్ చేయడం నిజంగానే షాకిస్తోంది అంటూ యువ‌త‌రం వ్యాఖ్య‌ల్ని జోడిస్తోంది.

నిత్యం యోగాతో పూజా జీవితం ప్రారంభమవుతుంది. ఆమె తన ఫిట్ నెస్ డైరీల నుండి ఫోటోల‌న‌ తన ఇన్ స్లాలో షేర్ చేస్తూ హీట్ పెంచుతున్నారు. మంగళవారం పూజా ఇన్ స్టాలో త్రోబాక్ ఫోటోని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది.

దీనిని ప‌దంగుస్తాస‌న అని అంటారు. కాలి బొటనవేలి బ‌లంపై అలా గాల్లోకి లేచే సాహ‌సం నిజంగా అనుభ‌వంతో చేయాల్సినది. పూజా భర్త .. నటుడు నవాబ్ షా వ్యాఖ్యల విభాగంలో హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీలను షేర్ చేశారు. పూజా బాత్రా ఇంత‌కుముందు టాలీవుడ్ లో ప‌లు విజ‌యవంత‌మైన చిత్రాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే స‌డెన్ గా సోష‌ల్ మీడియాల్లోకి వ‌చ్చి సంచ‌లనాల‌కు తెర తీసారు.