Begin typing your search above and press return to search.

మాజీ హీరోయిన్ కూతురి.. స్టన్నింగ్ లుక్

By:  Tupaki Desk   |   12 Nov 2022 2:30 PM GMT
మాజీ హీరోయిన్ కూతురి.. స్టన్నింగ్ లుక్
X
బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో వారసులలో కేవలం అబ్బాయిలు మాత్రమే కాకుండా అమ్మాయిలు కూడా గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు హీరోయిన్స్ గా ఒక రేంజ్ లో క్లిక్ అవుతున్నారు. అయితే సక్సెస్ తో పాటు ఇక్కడ మంచి టాలెంట్ ఉంటేనే ఎవరైనా సక్సెస్ అవుతారు అని వాళ్ళు చెప్పగానే చెబుతున్నారు. ఇక బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ పూజ బేడీ గారాల కూతురు ఆలయ కూడా గత కొంతకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని అడుగులు వేస్తోంది.

టీనేజ్ లోనే గ్లామరస్ అందాలతో అందరిని ఆశ్చర్యపరిచిన ఆలయ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు అందుకునెందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఎక్కడ సినిమా ఈవెంట్స్ జరిగినా కూడా వాలిపోతున్న ఈ భామ గ్లామరస్ అందాలతో కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. గత రాత్రి GQ అవార్డ్స్‌లో అద్భుతంగా కనిపించిన తర్వాత, ఈ యువ నటి బాంద్రాలో లంచ్ డేట్‌లో కనిపించింది.

ఆమె స్లీవ్‌లెస్ బాడీకాన్ మినీ డ్రెస్‌లో స్నీకర్లతో సూపర్ క్యూట్‌గా కనిపించింది. ఆలయ అలా కనిపించగానే అందరూ కూడా ఆమెను ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. గ్లామర్ తో ఆలయ మరోసారి షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీకి చాలా మంచి ఫ్యాన్ ఫాలింగ్ అయితే ఉంది. మరీ వల్గర్ గా కాకుండా ఆలయ చాలా డీసెంట్ గ్లామర్ ను ప్రజెంట్ చేయడానికి ఆసక్తిని చూపిస్తుంది.

ఇక ఈ బ్యూటీ సినిమా కెరీర్ విషయానికి వస్తే 2020లో జవానీ జానేమన్ అనే సినిమా చేసింది. అందులో సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో క్లిక్ కాలేకపోయింది.

అయినప్పటికీ ఈ బ్యూటీకి మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి. ఈ ఏడాది ఆమె రెండు సినిమాలు చూసేందుకు ఒప్పుకుంది. ఫ్రెడ్డీ అనే ఒక సినిమా విడుదలకు సిద్ధమవగా.. యూటర్న్ అనే మరొక సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఒక వెబ్ సిరీస్ చేసేందుకు కూడా ఆలయ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.