Begin typing your search above and press return to search.

నాన్న రైటర్- కూతురు డైరెక్టర్

By:  Tupaki Desk   |   26 Feb 2018 12:18 AM GMT
నాన్న రైటర్- కూతురు డైరెక్టర్
X
సంజయ్ దత్ హీరోగా 1991లో వచ్చిన సడక్ అప్పట్లో సంచలనం. ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ మూవీ దత్ ఇమేజ్ ని ఓ పది మెట్లు పైకి ఎక్కించేసింది. పూజా భట్ హీరొయిన్ గా నటించిన ఆ మూవీకి దర్శకుడు ఆమె తండ్రి మహేష్ భట్. కమర్షియల్ గా గొప్ప విజయం సాధించిన సడక్ లో నసంపుకుడిగా విలన్ పాత్రలో భయపెట్టిన సదాశివ్ ఆమ్రపూర్కర్ చాలా కాలం పాటు అవకాశాలకు కొదవ లేకుండా చూసుకున్నాడు. ఇదే సినిమా పదేళ్ళ గ్యాప్ తర్వాత తమిళ హీరో ప్రశాంత్ - సుస్వాగతం హీరొయిన్ దేవయాని జోడిగా ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్ పాత్రలో రీమేక్ చేసారు కాని అది ఆ స్థాయి విజయాన్ని దక్కించుకోలేదు. మ్యూజిక్ లవర్స్ ఫేవరెట్స్ లో సడక్ కు ఇప్పటికీ చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. దాని తర్వాతే నాగార్జున కోరిమరీ తన క్రిమినల్ సినిమాను మహేష్ భట్ తో తీయించాడు. చిరంజీవి సైతం తన హింది జెంటిల్ మెన్ రీమేక్ కోసం మహేష్ భట్ మీదే ఆధారపడ్డారు.

అంతటి హిస్టరీ ఉన్న సడక్ కు సీక్వెల్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి చాలా ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. సడక్ లో హీరొయిన్ గా నటించిన పూజా భట్ సడక్ 2 కు దర్శకత్వం వహించనుండగా ఫస్ట్ పార్ట్ కు కెప్టెన్ గా వ్యవహరించిన ఆమె తండ్రి మహేష్ భట్ దీనికి రచన అందించబోతున్నారు. కీలకమైన హీరొయిన్ పాత్రకు అలియా భట్ ను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కథ విపరీతంగా నచ్చడంతో తన డేట్స్ సర్దుకుని మరీ దీన్ని చేయడానికి ఆసక్తి చూపుతోందట. హీరోగా సిద్దార్థ్ మల్హోత్రా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. చాలా కీలకమైన విలన్ పాత్రకు నవాజుద్దిన్ సిద్దిక్ కోసం ప్రయత్నిస్తున్నారు.

90 దశకంలో వచ్చిన అల్ టైం సూపర్ హిట్స్ రీమేక్ చేసే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. అగ్నిపథ్ - ఆశికీ విజయం ఇచ్చిన కాన్ఫిడెన్సుతో ఒక్కొక్కటిగా ఇవి తెరకేక్కే సూచనలు కనిపిస్తున్నాయి. సాజన్ - కరణ్ అర్జున్ - ఖుదా గవా ఇలా క్యు ఇప్పుడు పెద్దదే ఉంది. సడక్ 2 ఎప్పుడు ప్రారంభం అయ్యేది మాత్రం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ముగ్గురు భట్(మహేష్-పూజా-అలియా)ల కాంబోలో వస్తున్న ఈ కాంబో ఇంకెన్ని సంచలనాలు రేపుతుందో.