Begin typing your search above and press return to search.

13 ఏళ్ల త‌ర్వాత పూజా ఫ్యామిలీ విహార‌యాత్ర‌?

By:  Tupaki Desk   |   11 Feb 2022 2:54 AM GMT
13 ఏళ్ల త‌ర్వాత పూజా ఫ్యామిలీ విహార‌యాత్ర‌?
X
ముంబై బ్యూటీ పూజా హెగ్డే బిజీ షెడ్యూల్స్ గురించి తెలిసిన‌దే. మూడు ప‌రిశ్ర‌మ‌ల్లో మూడు ముక్క‌లాట ఆడుతోంది ఈ బ్యూటీ. తెలుగులో అగ్ర నాయిక హోదాను ఎంజాయ్ చేస్తూనే బాలీవుడ్ లో భారీ క్రేజీ అవ‌కాశాల్ని అందుకుంటోంది.

మ‌రోవైపు త‌మిళంలో బిగ్ స్టార్స్ స‌ర‌స‌న ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. షెడ్యూళ్ల‌ను మ్యానేజ్ చేసేందుకు పూజా చాలానే క‌స‌ర‌త్తు చేయాల్సి వ‌స్తోంది. కెరీర్ ప్రారంభించి చాలా కాల‌మే అయినంద‌న ఇటీవ‌ల బిజీ షెడ్యూల్స్ ని మ్యానేజ్ చేసే విష‌యంలో కాస్త ఇబ్బందిప‌డుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

త‌న‌వ‌ర‌కూ సోలోగా కొన్ని విహార యాత్ర‌ల‌ను షూటింగ్ స్పాట్ లోనే ప్లాన్ చేస్తోంది.. కానీ కుటుంబం అంత‌టితో క‌లిసి విహార‌యాత్ర‌ల‌కు వెళ్ల‌లేక‌పోతోంద‌ట‌. దాదాపు 13ఏళ్ల గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు త‌న కుటుంబంతో క‌లిసి పూజా విహార‌యాత్ర‌ల‌కు వెళ్లింద‌ట‌. స్పాట్ నుంచి ఫోటోల‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది ఈ బ్యూటీ.

పూజా హెగ్డే నిన్ననే రణవీర్ సింగ్ తో ఊటీలో షూటింగ్ లో పాల్గొన్న ఫోటో వైరల్ గా మారింది. ఈ రోజు పూజా హెగ్డే తన కుటుంబం మొత్తంతో విహారయాత్రలో క‌నిపించింది. పూజా తన కుటుంబంతో కలిసి చిన్న పాటి విహారయాత్రను ప్లాన్ చేసిందిట‌. ఆన్ స్పాట్ చిత్రాన్ని పోస్ట్ చేయ‌గా వైర‌ల్ గా దూసుకెళుతోంది.

ఈ ఫోటోగ్రాఫ్ లో ఎన్న‌డూ లేనంత ఆనందంగా చాలా ఉత్సాహంగా కనిపిస్తోంది. ఆమె తల్లిదండ్రులు మరియు సోదరుడు త‌న‌తో పాటు ఈ యాత్ర‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ త‌న ఫ్యామిలీకి ఆస్తుల‌ను కూడ‌గ‌డుతోంది. ఇప్ప‌టికే సొంత ఇల్లు ఉన్నా కానీ ఫ్యామిలీ కోసం కోట్లాది రూపాయ‌లు వెచ్చించి భారీ డూప్లెక్స్ ఇంటిని నిర్మిస్తోంది. ఏడాదికి 20కోట్లు పైగా ఆర్జిస్తున్న ఈ బ్యూటీ ఒకే ఏడాదిలో నాలుగైదు చిత్రాల్లో న‌టిస్తూ క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల ద్వారానూ భారీగా ఆర్జిస్తోంది.