Begin typing your search above and press return to search.

న‌ల్ల కోక స్లీవ్ లెస్ బ్లౌజ్ లో పూజా హ‌ల్ చ‌ల్

By:  Tupaki Desk   |   12 Dec 2021 3:30 PM GMT
న‌ల్ల కోక స్లీవ్ లెస్ బ్లౌజ్ లో పూజా హ‌ల్ చ‌ల్
X
బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే వ‌రుస ఫోటోషూట్లు మైండ్ బ్లాక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు బ్లాక్ లో మ‌రోసారి మైండ్ బ్లాక్ చేసింది. నలుపు చీర క‌ట్టుకుని స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మాయ చేసింది ఈ ముంబై బ్యూటీ.

ఈ ఫోటోల‌పై స్పంద‌న‌లు అమోఘం. ఓ అభిమాని ఆమెను అందమైన నారీ అంటూ పొగిడేశాడు. ఇటీవ‌లే బీస్ట్ షూట్ ను ముగించిన తర్వాత అద్భుతమైన బ్లాక్ సీ-త్రూ చీరలో ఫోటోషూట్ ని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ కేక పుట్టించింది. ఈ ఫోటోల‌కు మూడు బ్లాక్ హార్ట్ ఎమోటికాన్ లతో పాటు `సింపుల్` అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ నల్ల చీర ఆరిజిన్స్ హైదరాబాద్ బట్టల లేబుల్ లోని షెల్ఫ్ ల నుండి దిగుమ‌తి చేసిన‌ద‌ని తెలిసింది. సెలబ్రిటీ స్టైలిస్ట్ అశ్విన్ మావ్లే పూజా కోసం కాంటెంపరరీ ఎత్నిక్ లుక్ ని తీర్చిదిద్దారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో విజ‌యం అందుకున్న పూజా త‌దుప‌రి రాధేశ్యామ్ రిలీజ్ కోసం వేచి చూస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌చారంలో బిజీగా ఉంది. బీస్ట్ చిత్రీక‌ర‌ణ‌ను ముగించింది. ఈ సినిమా 2022లో విడుద‌ల కానుంది.