Begin typing your search above and press return to search.

థియేటర్లో ఆ సీన్ చూస్తూ బుట్టబొమ్మ కంట కన్నీరు!

By:  Tupaki Desk   |   17 Oct 2021 3:48 AM GMT
థియేటర్లో ఆ సీన్ చూస్తూ బుట్టబొమ్మ కంట కన్నీరు!
X
వరుస చిత్రాలు చేయటం అగ్ర హీరోయిన్లకు పెద్ద విషయం కాదు. కానీ.. ఆ సినిమాలు సక్సెస్ కావటం ఒక ఎత్తు అయితే.. హీరోయిన్ గా తాను చేసిన క్యారెక్టర్ కు మంచి పేరు రావటం చాలా తక్కువగానే జరుగుతుంది. కానీ.. అలాంటి మేజిక్ ను పదే పదే రిపీట్ చేయటంలో రీల్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ముందుంటారు. ఫలానా హీరో సినిమా ఇలా ఉంటుందన్న ఇమేజ్ పెద్ద విషయం కాదు.. కానీ.. ఒక హీరోయిన్ చేసే మూవీలో ఆమె పాత్ర సమ్ థింగ్ స్పెషల్ గా.. రోటీన్ కు భిన్నంగా ఉండటం కాస్తంత అరుదైన విషయమే. హీరోను ఎలివేట్ చేసేలా సినిమాలతో పోలిస్తే.. హీరోయిన్ ను ఎలివేట్ చేసేలా మూవీలు చాలా తక్కువ వస్తుంటాయి.

ఆ కోవలోకే వస్తుంది.. మోస్ట్ ఎలిజిబుట్ బ్యాచులర్ మూవీ. పేరుకు అఖిల్ చుట్టూనే సినిమా తిరుగుతున్నట్లు అనిపించినా.. ఈ మూవీలో పూజా హెగ్డే పాత్రకు ఉండే ప్రాధాన్యత.. ఆన్ స్క్రీన్ మీద ఆమె ప్రదర్శించిన నటనకు ఫిదా కావాల్సిందే. తాజాగా తాను చేసిన మూవీ గురించి.. ఇతర విశేషాల గురించి ఒక మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడింది పూజా హెగ్డే.

తాజా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' మూవీని తన తల్లిదండ్రులతో రిలీజ్ అయిన రోజునే చూశానని.. వారే తన బిగ్గెస్ట్ క్రిటిక్స్ గా ఆమె చెప్పుకొచ్చారు. వారిద్దరికీ తన తాజా సినిమా నచ్చిందని.. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ చూస్తుంటే తన కంట కన్నీరు వచ్చిందని.. వాళ్లకు కన్నీళ్లు వచ్చాయంటూ ఎమోషనల్ అయ్యింది. ఇంతకీ.. పెళ్లి విషయంలో యూత్ కు మీరిచ్చే సలహా ఏమిటంటే అన్న ప్రశ్నకు.. పెళ్లీడు వచ్చిందని.. పెళ్లికి ఇదే సరైన సమయమని చేసుకోవటం సరికాదని చెప్పింది. జీవితమంతా కలిసి ఉండగలనన్న భావన ఒక వ్యక్తితో ఉన్నప్పుడు అనిపిస్తుంది కదా.. అప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోవాలన్న సలహాను ఇచ్చింది.