Begin typing your search above and press return to search.

ఐరన్ స్టాంప్ బ్యూటీల కష్టాలు

By:  Tupaki Desk   |   7 Sep 2018 1:30 AM GMT
ఐరన్ స్టాంప్ బ్యూటీల కష్టాలు
X
గ్లామర్ విషయంలో లోటు లేకపోయినా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నా ఇక్కడ హీరోయిన్లు నిలదొక్కుకోవడానికి కావాల్సింది సక్సెస్. అది లేనంత వరకు ఎంత వయ్యారాలు ఒలకబోసినా ఏదో ఒకరోజు బ్రేక్ పడక తప్పదు. అందుకే ఇద్దరు హాట్ బ్యూటీలు మొదటి హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.అందులో మొదటగా ఉంది పూజా హెగ్డే. జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు లాంటి క్రేజీ హీరోల సరసన వరస ఛాన్సులు కొట్టేసిన పూజా హెగ్డే నిజం చెప్పాలంటే ఒక్క సాలిడ్ హిట్ కూడా లేదు. డీజే సూపర్ హిట్ అని ఎవరూ గట్టిగా అనలేని పరిస్థితి. రంగస్థలంలో ఐటెం సాంగ్ చేసినా హీరోయిన్ అంటే సమంతనే గుర్తుకొస్తుంది కాబట్టి పూజా ఖాతాలో వేయలేం.ఇక మొన్నీమధ్యే వచ్చిన సాక్ష్యం ఏమైందో చూసాంగా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేయటం సంగతి అటుంచితే అందులో పూజా పాత్ర ఏ రకంగానూ ఉపయోగపడలేదు సరికదా నెగటివ్ ఇంప్రెషన్ కూడా ఇచ్చింది. పోనీ కెరీర్ ప్రారంభంలో చేసిన ముకుందా ఒక లైలా కోసమైనా ఆడాయా అంటే వాటిదీ ఇదే ఫలితమే. అందుకే అరవింద సమేత వీర రాఘవ రూపంలో పెద్ద బ్రేక్ కోసమే ఎదురు చూస్తోంది పూజా హెగ్డే.

ఇక అను ఇమ్మానియేల్ పరిస్థితి భిన్నంగా ఏమి లేదు. తనను ఎక్కడికో తీసుకెళ్తుంది అని ఆశలు పెట్టుకున్న నా పేరు సూర్య హీరో బన్నీకి కూడా డ్యామేజ్ మూవీగానే మిగిలింది. మజ్నుతో మొదలుపెడితే అను చేసిన సినిమా ఏదీ చెప్పుకోదగ్గ హిట్ గా నిలవలేదు. అలా అని అవకాశాలు రావడం లేదని కాదు. ఏడాది మొదట్లోనే ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసిలో చేసింది. ఎక్కువ విమర్శలు అందుకున్న వాటిలో అను పాత్ర కూడా ఉంది. గత ఏడాది చేసిన ఆక్సిజన్-కిట్టు ఉన్నాడు జాగ్రత్తలది కూడా సేమ్ రిజల్ట్. అందుకే శైలజారెడ్డి అల్లుడు లో తనే సోలో హీరోయిన్ కాబట్టి మారుతీ పుణ్యమా అని గట్టెక్కాలని చూస్తోంది. బిజినెస్ పరంగా కూడా మంచి క్రేజ్ ఉండటంతో అను కోరుకున్నది నెరవేరితే దశ తిరిగినట్టే. గీత గోవిందం బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అను చెప్పుకోలేని పరిస్థితి. ఒక్క సీన్ రెండు డైలాగ్స్ కి క్రెడిట్ తీసుకోలేదుగా. సో పూజా అనులకు యంగ్ టైగర్ చైతులు ఎంత వరకు బ్రేక్ ఇస్తారో వేచి చూడాలి.