Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌30 : ఆ ఇద్దరు ముద్దుగుమ్మల మద్య పోటీ!

By:  Tupaki Desk   |   30 April 2022 2:30 AM GMT
ఎన్టీఆర్‌30 : ఆ ఇద్దరు ముద్దుగుమ్మల మద్య పోటీ!
X
ఎన్టీఆర్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా తో మరియు కొరటాల శివ ఆచార్య సినిమా తో బిజీగా ఉండటం వల్ల ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చిన ఎన్టీఆర్‌30 సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కేందుకు సిద్దం అవుతోంది. జూన్ లేదా అంతకు ముందుగానే షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని సమాచారం అందుతోంది. కొరటాల శివ ఆచార్య సినిమా పనులు ముగించిన వెంటనే ఎన్టీఆర్ 30 సినిమా నటీ నటుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.

ఎన్టీఆర్‌ 30 సినిమా లో హీరోయిన్ గా ఆలియా భట్‌ ను అనుకున్నారు. ఆమె కూడా ఓకే చెప్పిందనే వార్తలు వచ్చాయి. కాని కొన్ని కారణాల వల్ల ఆమె నో చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. ఆలియా భట్ స్థానంలో ఎవరిని భర్తీ చేయాలనే సమాలోచనలు గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతుంది కనుక ఆ స్థాయి ఉన్న హీరోయిన్‌ కావాలని కొరటాల శివ ప్లాన్‌ చేస్తున్నాడట.

సౌత్‌ లో మంచి స్టార్‌ డమ్‌ దక్కించుకుని బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్‌ పూజా హెగ్డే మరియు రష్మిక మందన్నా. వీరిద్దరు కూడా బాలీవుడ్‌ లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఇక సౌత్‌ లో వీరు చేస్తున్న సినిమాల సంఖ్య భారీగానే ఉంది. ఇలాంటి సమయంలో వీరిద్దరిలో ఒకరిని ఎన్టీఆర్‌ సినిమా కోసం ఎంపిక చేస్తే బాగుంటుందని యూనిట్‌ సభ్యులతో పాటు అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.

రష్మిక మందన్నా ఇప్పటికే బాలీవుడ్‌ సినిమాలు చేయడంతో పాటు పుష్ప సినిమా తో అక్కడ రచ్చ చేసింది. ఇక పూజా హెగ్డే అక్కడ సల్మాన్‌ ఖాన్‌ తో సినిమా చేయడంతో పాటు ఇక్కడ మహేష్‌ బాబు ఇంకా పలువురు స్టార్స్ తో సినిమాలు చేస్తుంది. కనుక ఇద్దరిలో ఎవరిని తీసుకుంటే సినిమాకు బలం గా మారుతారు అనే విషయాన్ని కొరటాల తో పాటు ఎవరు కూడా తేల్చుకోలేక పోతున్నారట.

సినిమా షూటింగ్‌ ప్రారంభం కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కనుక ఎన్టీఆర్‌ డేట్లకు అనుకూలంగా ఆ ఇద్దరు హీరోయిన్స్‌ లో ఏ హీరోయిన్‌ ఉంటే ఆమెను తీసుకోవడం బెస్ట్‌ అంటూ కొందరు సలహా ఇస్తూ ఉంటే మరి కొందరు మాత్రం పుష్ప సినిమా తో రచ్చ చేసిన రష్మిక మందన్నా అయితే ఎన్టీఆర్‌ కు జోడీగా బాగుంటుందని అంటున్నారు.

ఇప్పటికే పూజా హెగ్డే తో నటించిన కారణంగా రష్మిక మందన్నా కు ఎక్కువ మంది అభిమానులు ఓటు వేస్తున్నారు. కనుక కొరటాల శివ ఏం నిర్ణయం తీసుకుంటాడు అనేది ఆసక్తి గా మారింది. ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినా కాకున్నా కూడా వచ్చే నెలలో ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్బంగా తప్పకుండా అభిమానుల కోసం సర్‌ ప్రైజ్ ను ఇవ్వబోతున్నట్లుగా దర్శకుడు కొరటాల శివ సన్నిహితులు చెబుతున్నారు.