Begin typing your search above and press return to search.
#రాధేశ్యామ్ ఈవెంట్.. కళ్లన్నీ బుట్టబొమ్మపైనే!
By: Tupaki Desk | 24 Dec 2021 6:37 AM GMTఅందానికి అందం మతులు చెడే సెక్సీనెస్.. అద్భుతమైన నటనతో సినీవినీలాకాశంలో తారాజువ్వలా దూసుకెళుతోంది పూజాహెగ్డే. ముంబై నుంచి వచ్చిన ఈ బుట్ట బొమ్మ కెరీర్ పరంగా శిఖరాన్ని తాకుతోంది. టాలీవుడ్ అగ్రహీరోలందరి సరసనా ఈ బ్యూటీ అవకాశాలు దక్కించుకుంది. వరస బ్లాక్ బస్టర్లతో గోల్డెన్ లెగ్ గా వెలిగిపోతోంది. ఇంతకుముందు ఫ్లాపుల్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ కి కూడా పూజా ఛరిష్మా కలిసొచ్చింది. ఇప్పుడు రాధేశ్యామ్ కి తనే పెద్ద ప్లస్ కానుందని అంచనా వేస్తున్నారు.
అయితే పూజా ఎందుకనో కలతగా ఉందని ప్రభాస్ తో సరిపడలేదని పుకార్లు షికార్ చేశాయి. అసలు ప్రీరిలీజ్ అండ్ ట్రైలర్ ఈవెంట్ కి వస్తుందా రాదా? అంటూ డిబేట్లు నడిచాయి. అయితే అందరి సందేహాలకు చెక్ పెడుతూ బుట్టబొమ్మ రాధేశ్యామ్ ప్రీఈవెంట్లో ప్రత్యక్షమైంది. అసలు అందం అంటే నీవా? అన్నంత బ్యూటిఫుల్ గా ప్రిపేరై వచ్చింది. కంచి పట్టు చీరలో మతులు చెడగొట్టింది ఈ బ్యూటీ.
రాయల్ బ్లూ కలర్ పట్టు చీరలో పూజా ఎంతో ముగ్ధ మనోహరంగా కనిపించింది. హైదరాబాద్ లో జరిగిన రాధే శ్యామ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పూజా హెగ్డే చాలా అందంగా కనిపించింది.
థియేట్రికల్ ట్రైలర్ లో కూడా పూజా హెగ్డే అద్భుతంగా కనిపించింది. రాధే శ్యామ్ లో ఆమె కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ని అందించిందనే టాక్ ఉంది. ప్రస్తుతం పూజా శారీ లుక్ వైరల్ గా మారింది. అందమైన చీరలో అంతే అందంగా ముసిముసిగా నవ్వేసుకుంటున్న పూజా పైనే కళ్లన్నీ నిలిచాయి. రాధేశ్యామ్ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. పాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్ విడుదలకు వారం గ్యాప్ తో ఈ చిత్రం రిలీజ్ కి సిద్ధమవుతోంది.