Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ:మత్తెక్కించే పూజా పుష్పం
By: Tupaki Desk | 8 July 2018 6:13 AM GMTముకుందాతో టాలీవుడ్ కు పరిచయమైన పూజా హెగ్డే ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారడానికి చాలా కాలమే ఎదురు చూడాల్సి వచ్చింది. వరుణ్ తేజ్ నాగ చైతన్య లాంటి హీరోలతో చేసినా లాభం లేకపోయింది. పోనీ బాలీవుడ్ లో ట్రై చేద్దామని హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోతో మొహంజదారో చేస్తే అది కూడా డిజాస్టర్ గానే మిగిలింది. దెబ్బకు కొంత కాలం ఐరన్ లెగ్ అనే స్టాంప్ తప్పలేదు. డీజే లో బికినీ షోతో పాటు క్యూట్ గా కనిపించి యూత్ మతులు పోగొట్టిన పూజా ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాకపోయినా తను కోరుకున్న దాని కన్నా ఎక్కువ పేరు తెచ్చుకుంది. ఇటీవలే జిగేల్ రాణి అంటూ రంగస్థలంలో ఐటెం సాంగ్ చేసి ఇండస్ట్రీ హిట్ లో ఒక భాగం అయ్యింది. తాజాగా మహేష్ బాబు 25వ సినిమాతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ తన పర్స్ లో వేసేసుకున్న పూజా హెగ్డే జులై 27 విడుదల కానున్న సాక్ష్యం కోసం ఎదురు చూస్తోంది.
నిన్న జరిగిన సాక్ష్యం ఈవెంట్ లో తనే మెయిన్ హై లైట్ గా నిలిచింది. పద్ధతిగా అనిపించే డ్రెస్ తో దాచీ దాచకుండా అందాలు చూపిస్తూ పూజా చేసిన మేజిక్ చూపు పక్కకు తిప్పుకోకుండా చేసింది. త్వరలో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ సైన్ చేయడానికి వెయిట్ చేస్తున్న పూజా త్వరలో హృతిక్ రోషన్ తో మరో సినిమా చేసే అవకాశం ఉంది. చాలా విభిన్నమైన పాత్రను తన కోసం డిజైన్ చేసినట్టుగా టాక్. సౌత్ లో స్టార్ హీరోలందరి సరసన ఒక్కొక్కటిగా ఆఫర్స్ కొట్టేస్తున్న పూజా బాలీవుడ్ లో సైతం గట్టిగా పాగా వేసే ప్లాన్ లో ఉంది. సాక్ష్యం కూడా హిట్ అయితే లక్కీ గర్ల్ గా కూడా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.