Begin typing your search above and press return to search.

మహర్షి బి హైండ్ ది సీన్స్.. హెయిర్ ఫ్లిప్

By:  Tupaki Desk   |   3 May 2019 1:54 PM GMT
మహర్షి బి హైండ్ ది సీన్స్.. హెయిర్ ఫ్లిప్
X
సినిమాను జస్ట్ రెండున్నర గంటే కదా అని తేలిగ్గా తీసుకుంటాం. కానీ ఆ రెండున్నర గంట వెనక ఆరు నెలల సమయం.. కొన్ని వందల మంది శ్రమ ఉంటుంది. ఇక బడ్జెట్ సంగతి చెప్పనవసరమే లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అయితే ఏడాదికి పైగా పడుతుంది. ఎందుకు అంటే.. బిహైండ్ ది సీన్స్ క్వాలిటీ కోసం ఎంతో తపన పడతారు ఫిలిం మేకర్స్. ఇక హీరో హీరోయిన్ల శ్రమ కూడా పైకి మనకు కన్పించేంత సింపుల్ గా ఉండదు. అంతెందుకు.. సింపుల్ అనుకున్న చిన్న షాట్లకు కూడా ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. తాజాగా 'మహర్షి' బ్యూటీ పూజా హెగ్డే అలాంటి ఒక బిహైండ్ ది సీన్స్ వీడియో ను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది.

విడియోను షేర్ చేస్తూ "హెయిర్ ఫ్లిప్స్( తల ను అటూ ఇటూ తిప్పుతూ జుట్టును స్టైల్ గా కదిలేలా చేయడం) అనేవి చాలా కష్టం. #ఎవరెస్ట్ అంచున సాంగ్ లో నుండి బిహైండ్ ది సీన్స్ వీడియో ఇది" అని క్యాప్షన్ ఇచ్చింది. #మహర్షి # మళ్ళీ మళ్ళీ ట్రై చెయ్యండి #పైకి కనిపించేంత సులభం కాదు.. అంటూ దీనికి హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చింది. జస్ట్ సెకండ్స్ మాత్రమే కనిపించే హెయిర్ ఫ్లిప్ కే ఇంత తతంగం ఉంటే ఇక నిజం గా కష్టమైన సీన్ అయితే హీరో హీరోయిన్లు ఎంత కష్టపడాల్సి వస్తుందో మనం అర్థం చెసుకోవచ్చు. అందుకే పూజా ఇచ్చిన లాస్ట్ హ్యాష్ ట్యాగ్ "#notaseasyasitlooks రియల్ లైఫ్ లో కూడా నిజమే. పక్కనోడు చేసే పని చూసి.. 'ఓస్ అదెంత మనమైతే చిటికెలో చేస్తాం' అనుకుంటారు. కానీ మనం స్వయంగా రంగంలోకి దిగితే కాని అసలు కష్టం తెలీదు.

'మహర్షి' మే 9 న రిలీజ్ అవుతోంది కాబట్టి 'ఎవరెస్ట్ అంచున' పాట చూసే సమయంలో ఈ హెయిర్ ఫ్లిప్ షాట్ ఎక్కడ వస్తుందో కాస్త జగ్రత్తగా పరిశీలించండి.. ఎందుకంటే మీరు కళ్ళు మూసుకుని తెరిచేలోపు హెయిర్ ఫ్లిప్ షాట్ అయిపోతుంది.. అది సంగతి..!


వీడియో కోసం క్లిక్ చేయండి