Begin typing your search above and press return to search.

ఈ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కాస్త 'మోస్ట్ పెయిడ్'గా మారిందా..?

By:  Tupaki Desk   |   28 July 2020 4:00 PM GMT
ఈ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కాస్త మోస్ట్ పెయిడ్గా మారిందా..?
X
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది పూజాహెగ్డే. ఇటు సౌత్ అటు నార్తులో మోస్ట్ వాంటెడ్ హీరోయినుగా వెలిగిపోతుంది ఈ ముంబై భామ. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే మహర్షి, అరవింద సమేత, అల వైకుంఠపురంలో.. లాంటి వరుస హిట్లతో టాప్ హీరోల సరసన అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో షూటింగ్ జరుపుకుంటున్న సినిమాతో పాటు అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో హీరోయినుగా నటిస్తుంది. అంతేగాక బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న ‘కబీ ఈద్‌ కబీ దివాలీ’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇవేగాక త్వరలోనే తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టబోతుందని సమాచారం.

అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' హీరోయిన్ సినిమాలను ఓకే చేయడానికి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. అదీగాక అందరి హీరోయిన్ల కంటే పారితోషికం రేట్లు కూడా భారీగా పెంచేసిందట. ప్రస్తుతం హీరో అఖిల్ కంటే హీరోయిన్ పూజకే ఎక్కువ చెల్లిస్తున్నారట నిర్మాతలు. ఇక హీరోకంటే ఎక్కువ పారితోషికాన్ని అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలోకి పూజ చేరిందని ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోతున్న పూజ బ్యాంకు బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఓ పాన్ ఇండియా మూవీకి కోటి తీసుకుంటుందట. అంతేగాక ఇక పై రెండు కోట్లు డిమాండ్ చేస్తుందంటూ వార్తలొస్తున్నాయి. చూడాలి మరి.. మోస్ట్ వాంటెడ్ పూజా కాస్త మోస్ట్ పెయిడ్ హీరోయినుగా మారినట్లు తెలుస్తోంది.