Begin typing your search above and press return to search.

కొద్దీకాలానికే ఫ్యామిలీలా అయిపోయాం: డైరెక్టర్ పై పూజాహెగ్డే కామెంట్

By:  Tupaki Desk   |   15 March 2021 9:30 AM GMT
కొద్దీకాలానికే ఫ్యామిలీలా అయిపోయాం: డైరెక్టర్ పై పూజాహెగ్డే కామెంట్
X
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమ్మడి చేతిలో మీడియం సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలు కూడా దక్కించుకుంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమా చేసిన పూజా త్వరలోనే ఇళయదళపతి విజయ్ సరసన ఓ సినిమా చేయనుంది. ఆ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా అనే టాక్ ఉంది. ఇదిలా ఉండగా.. నిజానికి పూజా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందింది. కానీ ముంబై నుండి వచ్చి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్డం సొంతం చేసుకోవడం అంటే మాములు విషయం కాదు. మొదటినుండి కూడా పూజా సక్సెస్ ఫుల్ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటూ హిట్స్ ఖాతాలో వేసుకుంటుంది.

ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన 'కబీ ఈద్ కబీ దీవాలి' సినిమాతో పాటు రన్వీర్ సింగ్ సరసన 'సర్కస్' సినిమా చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూనే ఉంది పూజా. అయితే స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి పుట్టినరోజు సందర్బంగా పూజా.. శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఆయన పై అభిమానాన్ని బయటపెట్టింది. గతేడాది సర్కస్ సినిమా షూటింగ్ మొదలైంది. ఓ షెడ్యూల్లో కూడా పాల్గొంది పూజా. కానీ ఈ తక్కువ టైంలోనే రోహిత్ తనను ఫ్యామిలీ మెంబెర్ లా చూస్తాడని చెప్పింది. ఆమె సోషల్ మీడియాలో.. 'మోస్ట్ కూలెస్ట్, కైండెస్ట్ డైరెక్టర్ రోహిత్ సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మనం వర్క్ స్టార్ట్ చేసిన తక్కువకాలంలోనే మంచి ఫ్యామిలీ బంధం క్రియేట్ ఏర్పడింది. ఆల్రెడీ నేను మీ సినిమాలకు వీరాభిమానిని. అలాగే ఈ ఏడాది మీకు సంతోషంతో పాటు బ్లాక్ బస్టర్స్ దక్కాలని ఆశిస్తున్నాను' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం పూజా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భామ ఆచార్య సినిమాలో కూడా కనిపించనుంది.