Begin typing your search above and press return to search.

పూజ మాటల్లో లాజిక్ ఉంది కాని

By:  Tupaki Desk   |   21 Feb 2019 4:07 AM GMT
పూజ మాటల్లో లాజిక్ ఉంది కాని
X
వరుణ్ తేజ్ ముకుందాతోనే డెబ్యూ ఇచ్చినప్పటికీ మొదటి బ్రేక్ కోసం కొన్నేళ్లు ఎదురు చూడాల్సి వచ్చిన హీరోయిన్ పూజా హెగ్డే డిమాండ్ మాములుగా లేదు. డీజె ఫలితంతో సంబంధం లేకుండా అందులో చేసిన బికినీ షో పుణ్యమా అని ఆఫర్లు క్యూ కట్టాయి. అయినా కొంతకాలం సక్సెస్ అందని ద్రాక్షే అయ్యింది. ఆ కొరతను తీరుస్తూ త్రివిక్రమ్ అరవింద సమేత వీర రాఘవ రూపంలో బంపర్ హిట్ ఇచ్చేసాడు. మహేష్ బాబు మహర్షితో పాటు ప్రభాస్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న ఈ క్యూట్ బ్యూటీ హిందీలో అక్షయ్ కుమార్ సరసన హౌస్ ఫుల్ 4 చేసింది.

అది హిట్ అయితే బాలీవుడ్ లో కూడా జెండా పాతొచ్చని తన ప్లాన్. గతంలో హృతిక్ రోషన్ తో చేసిన మొహెంజోదారో చేదు ఫలితాలను ఇచ్చిన నేపథ్యంలో దీని మీద తనకు చాలా ఆశలే ఉన్నాయి. ఇక పారితోషికాల విషయంలో పూజా చర్చకు దారితీసే ఓ ఆసక్తికరమైన పోయింట్ లేవనెత్తింది.

దాని ప్రకారం హీరోయిన్లు కూడా తమ టాలెంట్ తో సినిమాల స్థాయిని వంద కోట్లు దాటిస్తునప్పుడు రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఎందుకు వివక్ష ఉండాలనే ఓ ప్రశ్న అడిగింది. ఉదాహరణగా హీరోలు లేకుండా ఆడిన రాజీ-వీర్దే వెడ్డింగ్ లను చూపిస్తోంది. పూజా హెడ్గే మాటల్లో నిజం లేకపోలేదు. ఆ రెండు సినిమాలు కేవలం ఫీమేల్ క్యారెక్టర్స్ వల్లే ఆడినవి. అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది. హీరో ఇమేజ్ ప్రాతిపాదికన నడిచే భారతీయ సినిమా మార్కెట్ లో నిత్యం రాజీ లాంటి క్లాసిక్స్ రావు. వీటిని డిఫరెంట్ జానర్ కింద చూడాలి. రాజీలో అద్భుతంగా కట్టిపారేసిన ఆలియా భట్ ఇటీవలే విడుదలైన గల్లీ బాయ్ లో హీరోతో సమానంగా కాకపోయినా తన ఉనికిని చాటుకొనే రేంజ్ లో మెప్పించింది.

కానీ సినిమా అమ్మకంలో మొదటి ఫ్యాక్టర్ రన్వీర్ సింగే అవుతాడు. ఒకప్పుడు భానుమతి-విజయశాంతి లాంటి వాళ్ళు హీరో డామినేటెడ్ మార్కెట్ ని సవాల్ చేసినవాళ్లే. కానీ ఇది అందరివల్లా జరిగే పని కాదు. అందులోనూ మాస్ ని చేరుకోవాలంటే ఎంత పెద్ద టాలెంటెడ్ హీరోయిన్ అయినా స్టార్ల మద్దతు అవసరమే. లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న టైంలోనూ విజయశాంతి టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో నటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పూజ లేవనెత్తిన అంశం అలా ఫ్లాష్ బ్యాక్ లోకి లాక్కెళుతోంది. చూద్దాం తను కోరుకున్న మార్పులు ఏమైనా వస్తాయేమో.