Begin typing your search above and press return to search.
ఆ హీరో నాకు ఫ్రెండ్ మాత్రమే.. అంటున్న బుట్టబొమ్మ
By: Tupaki Desk | 6 April 2020 4:00 PM GMTప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరంటే … టక్కున చెప్పే పేరు పూజా హెగ్దేే. వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో నటించడంతో పాటు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటోంది. అంతేగాక అందరిలో భారీగా పారితోషికం అందుకుంటుంది అని కూడా సమాచారం. ప్రస్తుతం ఈ బ్యూటీ అఖిల్ కు జోడీగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 20వ చిత్రంలో కూడా పూజానే హీరోయిన్. తమిళం నుండీ కూడా ఈమెకు పెద్ద ఆఫర్లు వస్తున్నాయి కానీ ఈమె మాత్రం ఇంకా సైన్ చెయ్యలేదట. ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ హీరో వినోద్ మెహ్రా కుమారుడు రోహాన్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో పడిందని గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
‘బజార్’ చిత్రంతో మంచి పాపులర్ అయిన ఈ నటుడితో పూజా హెగ్డే.. డేటింగ్ లో ఉందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలు నిజం కాదని కొట్టిపారేసిందట పూజ. ముంబై లోని కొన్ని ప్రదేశాలలో వీరిద్దరూ కలిసి ఉండగా కొందరు ఆకతాయిలు తమ ఫోటోలు క్లిక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారట. అంతే ఇక వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని పుకార్లు మొదలయ్యాయి. అయితే తాజాగా ఈ పుకార్లు పూజ చెవిన పడటం తో స్పందించిందట. రోహన్ నేను కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని, మా మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని తేల్చి చెప్పిందట అమ్మడు. ఇంతకు ముందు కూడా రోహన్ కి, తార సుతారియాకి మధ్య ప్రేమాయణం నడిచినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారో వాళ్లే సమాధానం ఇవ్వాలి అన్నట్లు జవాబిచ్చిందట మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్యూటీ.