Begin typing your search above and press return to search.

పూజాహెగ్డే మ‌న‌సులో వినూత్న కోరిక‌లు!

By:  Tupaki Desk   |   12 March 2022 6:30 AM GMT
పూజాహెగ్డే మ‌న‌సులో వినూత్న కోరిక‌లు!
X
ముంబై బ్యూటీ పూజాహెగ్డే కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ అంటూ మూడు ప‌రిశ్ర‌మ‌ల్ని చుట్టేస్తుంది. న‌టిగా డే బై డై షైన్ అవుతూ కెరీర్ ని స‌క్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమాలు బుట్ట‌బొమ్మ కెరీర్ కి పెద్ద ట‌ర్నింగ్ అని చెప్పొచ్చు. ఇక్క‌డ స‌క్సెస్ ఫుల్ గా రాణిచండంతోనే ప‌ర‌భాష‌ల్లోనూ అవ‌కాశాలకు పునాది ప‌డింది. `అల వైకుంఠ‌పుర‌ములో`..`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ` తో బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ లు ఖాతాలో వేసుకుంది.

నిన్న‌టి రోజున బ్యూటీ న‌టించిన పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాకి డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికి న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లో న‌టించ‌డం..పూజా యాక్టింగ్ స్కిల్స్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నాయి. రొమాంటిక్ ల‌వ్ స్టోరీ చిత్రంలో పూజా పాత్ర హైలైట్ అయింది. న‌టిగా పూజాహెగ్డే కెరీర్ కి ప్ల‌స్ అనే చెప్పొచ్చు. సినిమా క‌మ‌ర్శియ‌ల్ గా స‌క్సెస్ అవుతుందా? లేదా ? అన్న‌ది ప‌క్క‌న‌బెడితే న‌టిగా పూజాహెగ్డే సెటిల్డ్ పెర్పార్మెన్స్ ఆక‌ట్టుకుంది. `రాధేశ్యామ్` ప్ర‌చార కార్య‌క్రమాల్లో సైతం త‌న పాత్ర‌కి వీలైనంత రీచ్ అయ్యేలా ప్ర‌య‌త్నం చేసింది.

తాజాగా బ్యూటీ లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌పైనా త‌న అభిరుచిని చాటింది. ద‌క్షిణాది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. బ‌ల‌మైన మ‌హిళా ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్ని సృష్టించ‌డంలో ఇక్క‌డి మేక‌ర్స్ చాలా ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉన్నారు. నిర్మాత‌లు అలాంటి క‌థ‌ల్ని ఎంక‌రేజ్ చేయ‌డంలో ముందుంటున్నారు. వాటిద్వారా హీరోయిన్ల‌కు మంచి గుర్తింపు..పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కుతున్నాయి. ఒక అమ్మాయి గా `సీత ఔర్ గీత‌`లో హేమమాలిని గుండాల‌ను కొట్ట‌డం చూసిన‌ప్పుడు - `గాల్ గాడోట్ వండ‌ర్ వుమెన్` పాత్ర‌ల్లో అమ్మాయిలు క‌నిపించిన‌ప్పుడు... ఏంజెలీనా జోలి `మిస్ట‌ర్ అండ్ మిసెస్` లో హార్డ్ కోర్ యాక్ష‌న్ చూసిన‌ప్పుడు ఎంతో శ‌క్తివంతమైన మ‌హిళా పాత్ర‌ల‌ని అనుభూతి క‌ల్గుతుంది.

అది నాకు ఎంతో ఎన‌ర్జీని.ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా ఏదైనా పెద్ద‌గా చేయాల‌ని అలాంటి పాత్ర‌లు ప్రేర‌ణని క‌ల్పిస్తాయి` అని తెలిపింది. ఏదో ఒక‌రోజు పూర్తి స్థాయి యాక్ష‌న్ చిత్రం చేసి భ‌విష్య‌త్ త‌రానికి స్ఫూర్తిగా నిల‌వాల‌ని ఆకాంక్ష‌ని వ్య‌క్తం చేసింది. అమ్మాయిలు బ‌లంగా..మ‌రింత ధృఢంగా ఉండే మ‌రిన్ని సినిమాలు రావాలి. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ అలా జ‌ర‌గ‌డం లేదు. నేను ఇలా మాట్లాడ‌టం వెనుక కార‌ణం మార్పు రావాల‌న్న‌దే ఆకాంక్ష‌తోనే` అని తెలిపింది. తెలుగులో ఇటీవ‌లి కాలంలో లేడీ ఓరియేంటెడె చిత్రాల‌కు పెద్ద పీఠ వేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన `మ‌హాన‌టి` సినిమాతో తెలుగు సినిమాకు జాతీయ‌..అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. అంత‌ర్జాతీయ ఫిలిం ఫెస్టివ‌ల్స్ లో `మ‌హాన‌టి` ప‌లు అవార్డులు..రివార్డులు సైతం ద‌క్కించుకుంది. ఇత‌ర భాష‌ల స‌క్సెస్ ఫుల్ లేడీ ఓ రియేంటెడ్ చిత్రాల్ని టాలీవుడ్ మేక‌ర్స్ ఇప్పుడిప్ప‌డే రీమేక్ చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాల ప్ర‌భావం తెలుగు సినిమాల‌పై ప‌డుతుండ‌టం విశేషం. సాంకేతికంగాను హాలీవుడ్ ని టెక్నాల‌జీని అందుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.