Begin typing your search above and press return to search.
ప్రేమ విషయంలో కుండ బద్దలు కొట్టినట్లు క్లారిటీ ఇచ్చేసింది
By: Tupaki Desk | 7 March 2022 9:36 AM GMTముకుందా.. ఒక లైలా కోసం అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన పూజా హెగ్డే మొదటి రెండు సినిమాల్లో కూడా చాలా పద్దతైన పాత్రల్లో నటించింది. ఆ రెండు సినిమాల తర్వాత రెండేళ్ల పాటు బాలీవుడ్ వెళ్లింది. మళ్లీ డీజే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజా హెగ్డే ను ముకుందా చూసిన వారు డీజే లో నటించింది ఆమె నా అంటూ ముక్కున వేలేసుకున్నారు. అంతగా షాక్ అయిన ప్రేక్షకులు మోడ్రన్ డ్రస్ ల్లో హాట్ పూజా హెగ్డే ను అభిమానించడం మొదలు పెట్టారు.
ప్రస్తుతం పూజా హెగ్డే పాన్ ఇండియా స్టార్ అనడంలో సందేహం లేదు. హిందీ లో సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న ఈమె తమిళ సూపర్ స్టార్ విజయ్ తో కలిసి నటించిన బీస్ట్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మరో వైపు మహేష్ బాబుకు జోడీగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా ను చేయబోతుంది. ఇంత మంది సూపర్ స్టార్స్ తో ఈమె సినిమా లు చేస్తున్న నేపథ్యంలో ఈమె రేంజ్ మరింతగా పెరగడం ఖాయం.
ఆ సినిమాల కంటే ముందుగా ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన రాధేశ్యామ్ సినిమా తో పూజా హెగ్డే మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా గత వారం రోజులుగా పూజా హెగ్డే బిజీ బిజీగా ఉంది. ఇప్పటికే ముంబై.. చెన్నై మీడియా సమావేశాలు ఏర్పాటు చేసిన యూనిట్ సభ్యులు తెలుగు మీడియా ముందుకు వచ్చారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పూజా హెగ్డే ను ప్రేమ విషయమై ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గత కొన్నాళ్లుగా ఈమె ప్రేమ పెళ్లి గురించిన చర్చ జరుగుతూ ఉంది. ఎట్టకేలకు పూజా నుండి ఆ విషయమై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అంటూ ప్రశ్నించగా అందుకు పూజా హెగ్డే ప్రస్తుతానికి ప్రేమించే సమయం లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను. భవిష్యత్తులో ఏమైనా ప్రేమలో పడుతానేమో తెలియదు అంటూ కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పేసింది.
ప్రభాస్ కు జోడీగా నటించిన రాధేశ్యామ్ సినిమా పై ఈమె చాలా ఆశలు పెట్టుకున్నట్లుగా ఉంది. ఈ సినిమా తో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా స్థానం ను సుస్థిరం చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద ఈమె నటించిన పలు సినిమాలు ఇప్పటికే బిగ్గెస్ట్ విజయాలను సొంతం చేసుకున్నాయి. కనుక ఈమె ముందు ముందు కూడా భారీ విజయాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది.