Begin typing your search above and press return to search.
మళ్లీ అటు మోజు పడుతోంది
By: Tupaki Desk | 9 July 2019 5:39 AM GMTసౌత్ లో హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించి గుర్తింపు దక్కించుకున్న పూజా హెగ్డే బాలీవుడ్ కు 'మొహంజుదారో' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం కోసం దాదాపు రెండేళ్ల పాటు సౌత్ లో ఒక్క సినిమాను ఒప్పుకోకుండా కష్టపడింది. కాని ఆ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది. ఆ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సమయంలోనే ఈ అమ్మడికి టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తున్న పూజా హెగ్డేకు మళ్లీ బాలీవుడ్ పై గాలి మల్లినట్లుగా ఉంది.
ప్రస్తుతం తెలుగులో మూడు నాలుగు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో ఒక చిత్రం చేసేందుకు సిద్దం అయ్యింది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రంకు గాను పూజా హెగ్డేను నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా బుక్ చేసుకున్నాడట. ఆ చిత్రం కోసం రెండు నెలలు కంటిన్యూగా ఈమె డేట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో ఈమె తెలుగులో నటిస్తున్న సినిమాల డేట్ల విషయంలో గందరగోళం ఏర్పడుతుందని అంటున్నారు.
డేట్లు సర్దుబాటు కాకపోవడంతో అల్లు అర్జున్ మూవీలో ఈమె పాత్ర నిడివి తగ్గించే యోచనలో కూడా త్రివిక్రమ్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మరో వైపు ప్రభాస్ తో కూడా ఈమె నటిస్తున్న విషయం తెల్సిందే. సౌత్ లో ఇంత బిజీగా ఉన్న ఈ అమ్మడు ఫ్లాప్ వచ్చిన బాలీవుడ్ కు వెళ్లడం అందరిని ఆశ్చర్య పర్చుతుంది. మరి ఈసారైనా ఈమెకు బాలీవుడ్ లో పాజిటివ్ ఫలితం వస్తుందేమో చూడాలి.