Begin typing your search above and press return to search.

బ్లాక్ డ్రెస్ లో జిగేల్ మన్న మహర్షి బ్యూటీ

By:  Tupaki Desk   |   4 March 2019 10:07 AM GMT
బ్లాక్ డ్రెస్ లో జిగేల్ మన్న మహర్షి బ్యూటీ
X
టైం కలిసివస్తే దశ తిరుగుతుంది అని చెప్పడానికి పూజా హెగ్డేకి మించిన ఉదాహరణ అక్కర్లేదేమో. ఐదేళ్ల క్రితం వరుణ్ తేజ్ ముకుందాతో పరిచయమై ఆ తర్వాత చైతుతో ఒక లైలా కోసం చేసినా రెండూ ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. పోనీ హిందీలో ప్రయత్నిద్దాం అనుకుంటే హృతిక్ రోషన్ తో చేసిన మొదటి సినిమా మొహెంజోదారో దారుణంగా పల్టీ కొట్టింది. అల్లు అర్జున్ డీజే ఆఫర్ వచ్చే దాకా తనది సంకట స్థితి అనే చెప్పాలి. అదీ ఇండస్ట్రీ హిట్ కాలేదు కానీ అందులో బికినీ అందాలకు ప్రేక్షకులతో పాటు దర్శకులు హీరోలు ఫిదా అయిపోయారు.

అక్కడి నుంచి పాప కెరీర్ ప్యాసెంజర్ నుంచి మెట్రో ట్రైన్ స్పీడ్ కు మారిపోయింది. వరసబెట్టి స్టార్ హీరోల సరసన క్రేజీ ప్రాజెక్టులు రావడం మొదలైంది. రంగస్థలంలో ఐటెం సాంగ్ చేసినా బ్లాక్ బస్టర్ కొట్టేసింది. గత ఏడాది అరవింద సమేత వీర రాఘవతో జూనియర్ ఎన్టీఆర్ తో మరో సక్సెస్ అందుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం మహర్షి షూటింగ్ లో బిజీగా ఉంది. సాహో కాకుండా ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న మూవీ కూడా పూజా అకౌంట్ లోనే ఉంది.

ఇన్స్ టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న పూజా తన అభిమానుల కోసం రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ వాటిని షేర్ చేస్తూ ఉంటుంది. చూసారుగా. ఫుల్ బ్లాక్ డ్రెస్ లో జిగేల్ మంటున్న మెర్క్యూరీ మార్క్స్ మెరిసిపోతూ ఉండగా వెనుకగా ఎవరినో చూస్తున్నట్టుగా పూజా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కు లైక్స్ వరదలా వస్తున్నాయి. అయినా జిగేల్ రాణిగా ఒంపుసొంపులను ఆరబోసే స్టైల్ లో చూసిన ఫాన్స్ కి పూజా ఇలా నిండైన స్తులతో ఫోజిస్తే కనెక్ట్ అవుతుందంటారా