Begin typing your search above and press return to search.

సో శాడ్! 2022 ముగింపు అయినా క‌లిసి రాలేదు!!

By:  Tupaki Desk   |   28 Dec 2022 2:46 AM GMT
సో శాడ్! 2022 ముగింపు అయినా క‌లిసి రాలేదు!!
X
2020 బ్లాక్ బ‌స్ట‌ర్ `అల వైకుంఠ‌పుర‌ములో` త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి ఫీట్ వేయాలంటే బుట్ట‌బొమ్మ‌కు సాధ్యం కావ‌డం లేదు! వ‌రుస‌గా అగ్ర హీరోల సినిమాల్లో న‌టించినా అవేవీ త‌న‌కు క‌లిసి రాలేదు. 2022 ఆద్యంతం ఈ భామ‌కు తీవ్ర నిరాశే మిగిఇంది. దేశంలోనే అత్యంత పాపులర్ హీరోయిన్లలో పూజా హెగ్డే వెలిగిపోతున్నా వ‌రుస ప‌రాజ‌యాలు ఈ ఏడాది త‌న‌ని ఆలోచ‌న‌లో ప‌డేశాయి. ఓవైపు దక్షిణాదిన న‌టిస్తూనే హిందీ చిత్రసీమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు పనిచేస్తోంది.

గ‌త ఏడాదిన ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న పాన్ ఇండియా మూవీ `రాధేశ్యామ్` ప‌రాజ‌యం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఆ త‌ర్వాత 2022 ఆరంభంలో బీస్ట్ (ద‌ళ‌ప‌తి విజయ్) మ‌రో బిగ్ ఫ్లాప్. క‌నీసం ఈ ఏడాది ముగింపు అయినా ఘ‌నంగా ఉంటుంద‌ని పూజా హెగ్డే ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. కానీ అది జ‌ర‌గ‌లేదు. రణవీర్ సింగ్ స‌ర‌స‌న‌ నటించిన తాజా చిత్రం `సర్కస్` పై చాలా ఆశలు పెట్టుకుంది. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమా ఏడాది ముగింపులో నిరంత‌రం వార్త‌ల్లో నిలిచింది. కానీ పాపం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.

బాలీవుడ్ లో ఓ వెలుగు వెల‌గాల‌న్న పూజా ప్రణాళికలను ఈ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ నాశనం చేసింది. ముంబై ప‌రిశ్ర‌మ‌లో పెద్ద హిట్ కొట్టాలని మరిన్ని వ‌రుస భారీ చిత్రాల‌ను ఛేజిక్కించుకోవాల‌ని ఆశించింది. కానీ పాపం అది ఇప్పుడు అసాధ్యంగా క‌నిపిస్తోంది. పూజాకి హిందీలో ఇప్ప‌టికి ఒకే ఒక్క అవ‌కాశం ఉంది.

సల్మాన్ కిసికా భాయ్ కిసికీ జాన్ పైనే ఆశ‌ల‌న్నీ. కొత్త ఏడాదిలో ఈ సినిమా విజ‌యం సాధిస్తే అది త‌న‌కు పెద్ద ఊర‌ట‌గా మారుతుంది. ఒక‌వేళ ఈ క్రేజీ సినిమా ప‌రాజ‌యం పాలైతే గ‌నుక ఇటు సౌత్ లో కూడా పూజా హ‌వా త‌గ్గిపోతుంద‌న‌డంలో సందేహం లేదు. త‌దుప‌రి మ‌హేష్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ మూవీల‌లో పూజా న‌టించ‌నుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.