Begin typing your search above and press return to search.

అఖిల్ కోసం జిగేల్ రాణిని దించుతున్నారు

By:  Tupaki Desk   |   11 April 2018 5:51 AM GMT
అఖిల్ కోసం జిగేల్ రాణిని దించుతున్నారు
X
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో మరొక హీరోయిన్ చేరిపోయింది. అల్లు అర్జున్ - దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో అలా కనిపించిందో లేదో పూజా హెగ్దే వరుస పెట్టి ఆఫర్స్ కొట్టేస్తోంది. గతంలో బాలీవుడ్ లో నటించినప్పటికి ఆఫర్స్ అందుకొని పూజకు ఇప్పుడు మాత్రం కాల్షీట్స్ మరొకరికి ఇవ్వలేనంతగా బిజీ అయిపోయింది. మరో ఐదేళ్ల వరకు అమ్మడి స్టార్ డమ్ కి డోకా లేదు.

ఇటీవల రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి అంటూ ఐటెమ్ సాంగ్ లో కనిపించాక పూజ ఇమేజ్ ఇంకా పెరిగింది. దీంతో స్పెషల్ రోల్స్ కి కూడా ఆమెను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సాక్ష్యం అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. ఇకపోతే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తో పాటు మహేష్జ్ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రంలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది. వంశీ పైడిపల్లి ఆ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఇక ప్రభాస్ హీరోగా జిల్ దర్శకుడు రాధామోహన్ తెరకెక్కించబోయే లవ్ స్టోరీలో కూడా అమ్మడు మేరవనుంది. అయితే రీసెంట్ గా మరో మంచి ప్రాజెక్ట్ లో డీజే బ్యూటీకి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడవ సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ కథలో పూజ హెగ్దే ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని టాక్. అలాగే ఒక సాంగ్ లో కూడా కనిపిస్తుందట. ఈ అవకాశాలను చూస్తుంటే టాలీవుడ్ లోకి మరో స్టార్ హీరోయిన్ వచ్చేసిందని చెప్పవచ్చు.