Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఎల్లో బికినీ.. వాటర్ బేబీ

By:  Tupaki Desk   |   26 Jun 2019 4:12 AM GMT
ఫోటో స్టొరీ: ఎల్లో బికినీ.. వాటర్ బేబీ
X
టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లే ఉన్నారు కానీ గ్లామర్.. స్టైల్..యాటిట్యూడ్ అన్నిటిని మిక్సీలో వేసినట్టు ఉండే భామ మాత్రం పూజా హెగ్డేనే. నటన విషయంలో ఎప్పుడూ యావరేజ్ మార్కులే తెచ్చుకునే ఈ అమ్మడు నటన విషయంలో తగ్గిన మార్కులను తన గ్లామర్ తో.. హాట్ నెస్ తో కవర్ చేసేస్తుంది. అందుకే స్టార్ హీరోల సినిమాల్లో వరసగా అవకాశాలు సాధిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. సినిమాలు మాత్రమే కాదు సోషల్ మీడియాను ఫుల్లుగా వాడుకోవడంలో.. తద్వారా నెటిజన్లను కట్ట కట్టి బుట్టలో పడేయడంలో పూజ మహా నేర్పరి.

తాజాగా అదేపనిని చేసింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు పూజ "వాటర్ బేబీ" అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో పసుపు రంగు ఈత దుస్తులు ధరించి ఈత కొలనులో వయ్యారిభామలాగా మోకాళ్ళపై కూర్చుంది. ఫోటోను వెనక నుంచి తీయడంతో పూజ బ్యాక్ అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. సెన్సువల్ గా ఉన్న తడి జుత్తు.. మొహాన్ని రైట్ టర్నింగ్ ఇచ్చి చూస్తుండడంతో పూజ ఒక అందాల రాశి లాగా కనిపిస్తోంది. అమ్మడి మొనోకిని పసుపు.. పూల్ వాటర్ బ్లూ.. కదులుతూ ఉన్న నీటి అలల్లో సూర్యకిరణాలు మెరుస్తూ పూజ అందాలకు డబల్ ఎఫెక్ట్ ఇచ్చాయి.

ఈ ఫోటో నెటిజన్లకు తెగ నచ్చడంతో లైకుల మీద లైకులు కొట్టారు. పోస్ట్ చేసిన పది గంటలలోపే దాదాపు 5 లక్షల లైక్స్ వచ్చాయి. ఇక కామెంట్లకైతే లెక్కే లేదు. "ఈ బికినీ ఆసనం పేరేంటో చెప్పవా?".. "హాట్ బికినీ మ్యాగ్నెట్".. "ఎల్లో ఎల్లో సెక్సీ ఫెల్లో" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక పూజ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే.. ప్రభాస్ - రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అర్జున్ కొత్త సినిమాలో కూడా పూజ నటిస్తోంది. హిందీలో 'హౌస్ ఫుల్ 4' లో నటిస్తోంది.