Begin typing your search above and press return to search.

ఎఫ్‌ 3 కి బుట్టబొమ్మ వల్ల కలిగిన ప్రయోజనం ఎంత?

By:  Tupaki Desk   |   31 May 2022 3:30 PM GMT
ఎఫ్‌ 3 కి బుట్టబొమ్మ వల్ల కలిగిన ప్రయోజనం ఎంత?
X
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్‌ 3 సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన దక్కించుకుంది. అయినా కూడా వసూళ్లు పర్వాలేదు అన్నట్లుగా నమోదు అవుతున్నాయి. ఎఫ్ 2 ప్రాంచైజీ మూవీ అవ్వడంతో ఎఫ్ 3 పై మొదటి నుండి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు మరింతగా పెంచే ఉద్దేశ్యంతో దర్శకుడు అనిల్‌ రావిపూడి చాలా ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగానే ఐటెం సాంగ్ ను సినిమాలో జొప్పించారు.

ఎఫ్ 3 లో టాలీవుడ్‌ స్టార్‌ క్రేజీ హీరోయిన్‌ పూజా హెగ్డే ఐటెం సాంగ్‌ చేసిన విషయం తెల్సిందే. వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లతో కలిసి పూజా హెగ్డే వేసిన స్టెప్పులు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. పాట కూడా లైఫ్‌ అంటే మినిమం ఇటా ఉండాలి అంటూ ఎక్కడ చూసినా కూడా మారు మ్రోగింది. ఎఫ్‌ 3 కి బజ్‌ క్రియేట్‌ అవ్వడంలో ఆ ఐటెం సాంగ్‌ కూడా కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు.

పాట మంచి సక్సెస్ అయ్యింది. మరి ఆ ఐటెం సాంగ్‌ వల్ల ఎఫ్‌ 3 కి కలిసి వచ్చింది ఎంత అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. మీడియా వర్గాల్లో మరియు సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఐటెం సాంగ్ వల్ల పెద్దగా కలిసి వచ్చింది ఏమీ లేదు. సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ కేవలం ఎంటర్‌ టైన్మెంట్ కోసం వెళ్తున్నారు. ఐటెం సాంగ్‌ లు మాస్ ఆడియన్స్ కు యూత్‌ ఆడియన్స్ కు అదనపు ఆకర్షణ అన్నట్లుగా నిలుస్తాయి.

కాని ఈ సినిమాను యూత్‌ ఆడియన్స్ మరియు మాస్ ఆడియన్స్ అని కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఐటెం సాంగ్స్ తో పెద్దగా పని లేదు. కనుక సినిమాలో ఐటెం సాంగ్ లేకున్నా కూడా పెద్దగా ఫరక్ పడకపోయేది అంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌ 3 కి అదనపు ఆకర్షణ అన్నట్లుగా ఆ ఐటెం సాంగ్‌ లేదు అనేది చాలా మంది అభిప్రాయం.

ఎఫ్‌ 3 వసూళ్ల విషయంలో కూడా కాస్త చర్చ జరుగుతోంది. ఇప్పటికే 70 కోట్ల రూపాయల వరకు వసూళ్లను ఈ సినిమా రాబట్టింది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతూ ఉన్నారు. కాని కొందరు యాంటీ ఫ్యాన్స్ మాత్రం సోషల్‌ మీడియాలో అంత సీన్ లేదు అంటున్నారు. దిల్ రాజుకు యాంటీ గా ఉండే వారు కావచ్చు సోషల్‌ మీడియాలో ఎఫ్‌ 3 కలెక్షన్స్ తగ్గించి ప్రచారం చేస్తున్నారు.