Begin typing your search above and press return to search.
పవన్ జోడీగా పూజ హెగ్డే ఖాయమే .. హింట్ ఇచ్చిన హరీశ్ శంకర్!
By: Tupaki Desk | 9 Oct 2021 3:30 AM GMTఅఖిల్ హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా చేశాడు;. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై హరీశ్ శంకర్ తనదైన స్టైల్లో మాట్లాడాడు. "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' అనే టైటిల్, అఖిల్ కి తప్ప అంత పెర్ఫెక్ట్ గా ఎవరికీ సెట్ కాదు. అఖిల్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు టాలీవుడ్ రణ్ బీర్ కపూర్ అవుతాడని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయనను చూస్తుంటే, టాలీవుడ్ హృతిక్ రోషన్ అవుతాడని అనిపిస్తోంది.
బ్యాచ్ లర్స్ అనగానే ఫుల్ ఎనర్జీ .. హ్యాపీగా ఓ లక్కీ నేచర్ .. యూత్ ఫుల్ గా ఉంటూ అందరితో కలిసి పోవడం ఉంటాయి. ఈ క్వాలిటీస్ అన్నీ చూస్తే ఇప్పుడున్న ఈ ఆడిటోరియంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అల్లు అరవింద్ గారు అనిపిస్తుంది. ఒక్క మ్యారిటల్ స్టేటస్ పక్కన పెడితే ఆయన చిరంజీవిగారి దగ్గర నుంచి అఖిల్ వరకూ సినిమాలో చేస్తూ, ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నారు. నాకు బన్నీతో కలిసి పనిచేస్తే ఎంత ఎనర్జీ అంటుందో .. అరవింద్ గారితో కలిసి పనిచేస్తే డబుల్ ఎనర్జీ ఉంటుంది. అంతలా ఆయన యూత్ తో కలిసిపోతారు.
ఇక ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ గురించి మాట్లాడాలి నేను. కరోనా కారణంగా ఏడాదిన్నరగా అందరూ ఖాళీగా ఉన్నారు .. ఒక్క పర్సన్ తప్ప. ఆ పర్సన్ కి కరోనా లేదు .. లాక్ డౌన్లు లేవు. ఎప్పుడు చూసినా వర్క్ వర్క్ .. అంతే. ఆ వ్యక్తి ఎవరో కాదు పూజ హెగ్డే. మామూలుగా హీరోయిన్ డేట్లు షూటింగు కోసం తీసుకుంటూ ఉంటాము. కానీ ఆమెతో ఫోన్లో మాట్లాడటానికి కూడా డేట్లు తీసుకోవలసి వస్తోంది. ఇప్పుడు ఆమె అందరి హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మహేశ్ బాబు .. ప్రభాస్ .. పవన్ కల్యాణ్" అంటూ స్టేజ్ పై పవన్ కల్యాణ్ పేరుకూడా చెప్పాడు.
అంటే పవన్ తో తాను చేయనున్న సినిమాకి పూజ హెగ్డేను సంప్రదించినట్టు .. ఆ సినిమా కోసం ఆమెను ఎంపిక చేసినట్టుగా చెప్పకనే చెప్పేశాడు. ఇంతకుముందు ఆయన పూజ హెగ్డేతో 'దువ్వాడ జగన్నాథం' .. 'గద్దలకొండ గణేశ్ చేసిన విషయం తెలిసిందే. హరీశ్ శంకర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, "పూజ హెగ్డే అంత బిజీగా మారడం చాలా హ్యాపీగా ఉంది. అసలు ఆమె ఈ ఫంక్షన్ కోసం మూడు గంటలు కేటాయించడం గొప్ప విషయం .. ఈ టైమ్ వేరే సినిమాకి ఇచ్చేసేది. పూజ హెగ్డే గ్లామరస్ హీరోయిన్ అయినప్పటికీ, తనలో మంచి ఫెర్మార్మర్ ఉంది.
భాస్కర్ క్యారెక్టరైజేషన్ చాలా గొప్పగా ఉంటుంది. 'బొమ్మరిల్లు' తరువాత అందరూ జెనీలియా పేరు మరిచిపోయి 'హాసిని' అనే పిలిచేవారు. ఈ సినిమా తరువాత అంతా పూజ పేరు మరిచిపోయి 'విభా' అనే పిలుస్తారేమో. బొమ్మరిల్లు' భాస్కర్ అంత బాగా రాస్తాడు. 'బొమ్మరిల్లు' భాస్కర్ అని పిలిచి పిలిచి బోర్ కొడుతోంది. ఈ సినిమా తరువాత నిన్ను బ్యాచ్ లర్ భాస్కర్ అని పిలుస్తారు .. అందులో డౌటే లేదు. అక్కినేని హీరోలందరికీ గీతా ఆర్ట్స్ బాగా కలిసొస్తుంది. అప్పుడు చైతూకి '100% లవ్' .. ఇప్పుడు అఖిల్ కి 'బ్యాచ్ లర్' అంటూ స్టేజ్ పై సందడి చేశాడు.