Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: జస్ట్ మెరిసిపోతోంది
By: Tupaki Desk | 27 Feb 2018 1:43 PM GMTదాదాపు అందరు హీరోయిన్లు మొదట పద్దతిగా ఉండే బట్టలు వేసుకుంటూ వచ్చి తర్వాత ఉన్నట్టుండి గ్లామరస్ గా మారిపోయి ఆశ్చర్య పరుస్తారు. కానీ మరి కొందరు మాత్రం అటు ట్రేడిషనల్ డ్రెస్ లు వేస్తూనే వాటికి గ్లామర్ టచ్ తెస్తూ మైమరపిస్తారు. అందులో మన పూజ హెగ్డే కూడా ఒకటి.
ఒక లైలా కోసం అంటూ నాగ చైతన్య తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ముకుంద లో పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది. కానీ అటు బాలీవుడ్ వెళ్లి మొహేంజోదరో చేసి మళ్ళీ టాలీవుడ్ కి వచ్చిందో లేదో డిజె సినిమా లో అందం మొత్తం ఆరబెట్టేసింది ఈ ముంబై భామ. ఈమధ్యనే ఒక పెళ్ళిలో మరీ అందం చూపించేసింది అమ్మడు. ట్రెడిషనల్ డ్రెస్ కి తన గ్లామర్ ని జత చేసి మన అందరిని ఔరా అనిపిస్తోంది. అలా ఓరగా చూస్తున్న ఆమె కళ్ళని చూసి కుర్రకారు హృదయం అర్రుతలూగకుండా ఉంటుందా చెప్పండి.
దువ్వడా జగన్నాధం తర్వాత ఈమె సినిమాలు ఏమి చేయలేదు కానీ మళ్ళీ సాక్ష్యం అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ తో రాబోతోంది. అలాగే రామ్ చరణ్ సమంత నటిస్తున్న రంగస్థలం లో ఐటమ్ సాంగ్ కూడా చేస్తోందని టాక్. అల్లు అర్జున్ పక్కన తనతో పోటీగా డాన్స్ చేసిన ఈమె ఇప్పుడు మెగా పవర్ స్టార్ పక్కన జిగేల్ రాణి గా కనిపించబోతోంది. అయితే ఈమె చేతిలో మహేష్ బాబు 25వ సినిమా.. అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలు కూడా ఉన్నాయి.