Begin typing your search above and press return to search.
ఆమె ఈమేనా.. నమ్మేదెలా?
By: Tupaki Desk | 10 May 2018 4:37 AM GMTకొన్ని విషయాలంతే. చూస్తే నమ్మలేం.. చెబితేనే నమ్మాలి. ఇండస్ట్రీలో తెగ పాపులరయిన వాళ్లలో కొందరి చిన్నప్పటి ఫొటోలు చూస్తే అది వాళ్లేనా అని డౌట్ వచ్చేస్తుంటుంది. రీసెంట్ గా చేతిలో గోలా ఐస్ క్రీమ్ పట్టుకుని స్కూల్ డ్రస్ లో బెరుగ్గా.. భయంగా ఫొటోకు ఫోజులిచ్చిన అమ్మాయి ఫొటో నెట్ లో వైరల్ గా మారింది. ఎందుకంటే ఈ అమ్మాయి ఇప్పుడు టాప్ హీరోయిన్. ఆమె ఎవరనేది తెలిస్తే ఇంతలోనే అంత మార్పా అనిపించక మానదు.
ఆ సొగసరి వేరేవరో కాదు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో అందానికి కేరాఫ్ అడ్రస్ లా.. బ్యూటీకి బ్రాండ్ అంబాసిడర్ లా పేరు తెచ్చుకున్న జిగేల్ రాణి పూజా హెగ్డే. కెరీర్ మొదట్లో పక్కింటమ్మాయిలా కనిపించే పాత్రల్లోనే కనిపించింది. అల్లు అర్జున్ హీరో గా నటించిన దువ్వాడ జగన్నాథమ్ బికినీలో అందాలన్నీ ఆరబోసి చూసేవాళ్లకు చెమటలు పట్టించింది. పూజా హెగ్డేలోని గ్లామర్ ఏంటో ఇండస్ట్రీకి తెలియడంతో ఆమెకు ఆఫర్లు వరస కట్టాయి. తాజాగా రంగస్థలం మూవీలో జిగేల్ రాణి అంటూ పూజా వేసిన స్టెప్పులకు థియేటర్లలో విజిల్స్ మార్మోగుతున్నాయి.
చిన్నప్పుడు క్యూట్ గా.. బెరుకుబెరుకుగా ఉండే పూజా ఇప్పుడు మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ రేంజికి ఎదిగింది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోలందరి పక్కన ఆమె హీరోయిన్ గా చేస్తోంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న సినిమాతో పాటు ప్రభాస్.. రామ్ చరణ్ ల నెక్ట్స్ మూవీస్ లోనే పూజానే హీరోయిన్ గా తీసుకున్నారు. ఒకప్పుడు సిగ్గుతో ముడుచుకుపోయిన అమ్మాయి ఈరోజు మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ రేంజి వెనుక ఉన్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఏమిటో పూజాయే చెప్పాలి.