Begin typing your search above and press return to search.

ఒత్తిడిని పోగొట్టే దివ్యౌష‌ధం ఏంటంటే..!

By:  Tupaki Desk   |   19 Oct 2021 7:18 AM GMT
ఒత్తిడిని పోగొట్టే దివ్యౌష‌ధం ఏంటంటే..!
X
జీవితంలో సాధార‌ణంగా ప్ర‌తీ ఒక్క‌రూ ఏదో ఒక సంద‌ర్భంలో భావోద్వేగానికి లోను కావ‌డం అన్న‌ది స‌ర్వ‌సాధార‌ణం. ఈ భావోద్వేగానికి సామాన్యుల‌తో పాటు స్టార్స్ కూడా అతీతులు కాదు. వారికీ భావోద్వేగాలుంటాయి. బాధ‌లూ వుంటాయి. క్రేజీ హీరోయిన్‌.. బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే కు కూడా చాలా సంద‌ర్భాల్లో భావోద్వేగానికి లోనైందంట‌.

త‌ను మాన‌సికంగా కుంగిపోయిన‌ప్పుడ‌ల్లా దాని నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం.. ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి ఐదు నిమిషాల పాటు ఏడ్చేద‌ట‌. కానీ ఆ త‌రువాత త‌న అలవాటుని మార్చుకుంద‌ట‌. ఒత్తిడికి గురైన‌ప్పుడ‌ల్లా దాన్ని అధిగ‌మించ‌డానికి సంగీతాన్ని అశ్ర‌యించ‌డం మొద‌లుపెట్టింద‌ట‌. `నా వొత్తిడికి సంగీతం దివ్యౌష‌ధం. నేను మాన‌సికంగా కృంగిపోయిన‌ప్పుడు సంగీతాన్ని ఆస్వాదిస్తాను. ఆ త‌రువాత ఐదు నిమిషాల పాటు ఏడుస్తాను. ఇలా చేయ‌డం వ‌ల్ల నా బాధ‌ల‌న్నీ తీరిపోతాయి. తిరిగి మునుప‌టి లాగే ఫ్రెష్ అయిపోతాను` అని తెలిపింది పూజా హెగ్డే.

అంతే కాకుండా తాను వ‌రుస షెడ్యూళ్ల‌తో బిజీగా వుండ‌టం వ‌ల్ల చాలా త‌క్కువ స‌మ‌యం నిద్ర‌పోతున్నాన‌ని... ఎక్కువ‌గా ప్ర‌యాణం చేస్తున్నాన‌ని... సినిమా అంటే నాకు ప్రేమ‌.. ఆ ప్రేమ వ‌ల్లే రిలాక్స్ కావ‌డానికి స‌మ‌యం లేక‌పోయినా తాను బాధ‌ప‌డ‌టం లేద‌ని.. చాలా ఆనందంగా వున్నాన‌ని.. క్ష‌ణం తీరిక లేకుండా బిజీగా వుండ‌టం నాకెంతో ఆనందాన్ని క‌లిగిస్తోంద‌ని పూజ తెలిపింది.

పూజాపై అంత ఒత్తిడి దేనికి?

నేటిత‌రం నాయిక‌ల్లో ఊపిరాడ‌ని షెడ్యూళ్ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న తార‌గా పూజా హెగ్డే పేరు మార్మోగుతోంది. త‌న‌వైపు వ‌చ్చే అవ‌కాశాల‌న్నీ అగ్ర హీరోల నుంచి ప్ర‌ముఖ బ్యాన‌ర్ల నుంచి.. ఆ క్ర‌మంలోనే ఈ భామ‌పై ఒత్తిళ్లు కూడా అదే రేంజులో ఉన్నాయి. ఇప్ప‌టికే టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించేసింది. ఇక‌పైనా వ‌రుస క‌మిట్ మెంట్ల‌తో బిజీగా ఉంది.

`అల‌వైకుంఠ‌పుర‌ములో` స‌క్సెస్ త‌ర్వాత పూజా హెగ్డే కెరీర్ మ‌రో స్థాయికి చేరుకుంది. ఇటీవ‌ల‌ జెట్ స్పీడ్ తో సినిమాల‌కు సంత‌కాలు చేస్తోంది. తెలుగు..త‌మిళ్..హిందీ అంటూ మూడు భాష‌ల్ని చుట్టేస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్.. బాలీవుడ్ లో క్ష‌ణం తీరిక లేకుండా బిజీగా గడుపుతోంది. వ‌రుస‌గా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల్లో న‌టిస్తూ రేంజ్ ని అంత‌కంత‌కు పెంచుకుంటూ పోతోంది. ఈ నేప‌థ్యంలోనే త‌మిళ్ లో విజ‌య్ స‌ర‌స‌న న‌టిస్తున్న `బీస్ట్` సినిమా కు అందుకున్న పారితోషికం స‌హా.. మ‌రికొన్ని విష‌యాల్లో పూజాహెగ్డే పేరు వివాదాస్ప‌దంగాను మారింది. భారీగా డిమాండ్ చేసిన పారితోషికంతో పాటు.. వ్య‌క్తిగ‌త సిబ్బంది.. బాడీగార్స్డ్.. చార్టెట్ ప్లైట్ పారితోషికాలు వ‌సూలు చేస్తోంద‌ని క‌థ‌నాలొచ్చాయి. దీంతో ఇరు ప‌రిశ్ర‌మల నిర్మాత‌ల నుంచి పూజాపై ఫిర్యాదులు అందుతున్నాయి. విమ‌ర్శ‌ల న‌డుమ పూజాహెగ్డే మీడియాలో మ‌రింత హైలైట్ అయింది. ఒక్క హిట్ తోనే ఇంత‌గా యాటిట్యూడ్ చూపిస్తుందా? అన్న‌ విమ‌ర్శ‌లా? సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి. పూజా హెగ్డే ఒక్కో సినిమాకు ఇప్పుడు 3 కోట్ల వ‌ర‌కూ ఛార్జ్ చేస్తోంద‌ట‌. అలాగే యాడ్స్ ద్వారా నెల ఆదాయం 50 ల‌క్ష‌ల‌కు పైగానే ఉంటుందిట‌. ఇలా రెండు చేతులా సంపాదిస్తోంద‌న్న టాక్ వినిపిస్తోంది.

మొత్తంగా ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ పూజాహెగ్దే సంపాద‌న మొత్తం 50-70 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా. కొంత పెట్టుబ‌డిని వ్యాపారాల్లోనూ పెట్టిన‌ట్లు స‌మాచారం. బిజినెస్ లో పెట్టుబ‌డి ఎంత‌ అన్న‌ది ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ప్ర‌స్తుతం పూజా హెగ్డే తెలుగులో `రాధేశ్యామ్`..`ఆచార్య‌` చిత్రాల్లో న‌టించింది.ఇవి రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అలాగే మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ కొత్త ప్రాజెక్ట్ లోనూ ఈ అమ్మడినే హీరోయిన్ గా తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారు. మ‌రోవైపు బాలీవుడ్ లో `సిర్క‌స్`..కోలీవుడ్ లో `బీస్ట్` చిత్రాల్లో న‌టిస్తోంది.