Begin typing your search above and press return to search.
రెమ్యునరేషన్లో బుట్టబొమ్మ తగ్గేదేలే..
By: Tupaki Desk | 19 Sep 2021 3:30 AM GMTకొంత మందికి వద్దు బాబోయ్ అన్నా సరే కాలం అలాగే కలిసి వచ్చేస్తుంటుంది. అదే ఇప్పుడు బుట్టబొమ్మ పూజా హెగ్డే విషయంలో జరుగుతోంది. అతి తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో క్రేజీ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది పూజా హెగ్డే. చేసింది తక్కువ సినిమాలే అయినా క్రేజీ స్టార్ ల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. తమిళ సినిమాతో కథానాయికగా కెరీర్ ప్రారంభించిన పూజా హెగ్డే అంచలంచెలుగా తన ప్రాభవాన్ని చాటుకుంటూ వస్తోంది.
తమిళ, ..తెలుగు, ..హిందీ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ మిగతా హీరోయిన్ లకి షాకిస్తోంది. తెలుగులో ప్రభాస్ తో `రాధేశ్యామ్`, రామ్ చరణ్ కు జోడీగా `ఆచార్య`లో నటిస్తున్న పూజా తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్‌తో `బీస్ట్`లో తొలిసారి జతకడుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి పూజా హెగ్డే అత్యంత భారీ స్థాయిలో పారితోషికాన్ని డిమాండ్ చేయడమే కాకుండా సొంతం చేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో పారితోషికం పరంగా తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న నయనతారని బీట్ చేసిందని చెబుతున్నారు. `బీస్ట్` కోసం పూజా హెగ్డే 5 కోట్లు పారితోషికం తీసుకుంటోందట. నయనతార ఒక సినిమాకు 4 కోట్లు వసూలు చేస్తుంటే పూజ `బీస్ట్` కోసం 5 కోట్లు వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు నయనతార తరువాత అత్యంత భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా కీర్తి సురేష్ నిలిచింది. ఆ తరువాత స్థానాన్నిరౌడీ హీరోయిన్ రష్మిక మందన్న దక్కించుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో నయనతార రెండవ స్థానానికి పడిపోగా.. కీర్తి సురేష్, రష్మిక మందన్న మూడు, నాలుగు స్థానాలకు పడిపోయారు.