Begin typing your search above and press return to search.
ఫ్యాషన్ కా బాప్.. బుట్టబొమ్మ వ్వాటే లుక్?
By: Tupaki Desk | 5 Jan 2023 3:30 AM GMTప్రతిసారీ ఫ్యాషన్ గేమ్ తో ఎలా మెరుపులు మెరిపించాలో బుట్టబొమ్మ పూజా హెగ్డేకి తెలిసినంతగా వేరొకరికి తెలియదేమో! బాలీవుడ్ లో నేటితరం నటవారసురాళ్ల కాంపిటీషన్ నడుమ పూజా తన ఉనికిని చాటుకునేందుకు నిరంతరం సరికొత్త యూనిక్ స్టైల్ ని అనుకరిస్తోంది. ముఖ్యంగా డిజైనర్ దుస్తుల ఎంపికలో తనని కొట్టేవాళ్లే లేరు అని నిరూపిస్తోంది. టోన్డ్ ఫిజిక్ ..సన్నజాజి లుక్ కి తగ్గట్టుగానే పూజా తన ఫ్యాషన్ ఎంపికలను మేనేజ్ చేస్తోంది.
తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన ఓ ఫోటోషూట్ అంతర్జాలంలో దుమారంగా మారింది. పూజా బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో కనిపించింది. పైగా డార్క్ ఫ్రాక్ కి సరితూగే నల్ల కళ్లద్దాలతో అల్ట్రా పోష్ లుక్ లో మెరుపులు మెరిపించింది. పూజా ట్రెండీ ఫ్రాక్ లో టూ గ్లామరస్ గా కనిపిస్తోంది.
పూజా హెగ్డే స్వగతంలోకి వెళితే.. తెలుగు-తమిళం- హిందీ పరిశ్రమల్లో పాపులర్ కథానాయిక. ఆరంభం మోడల్ గా తన వృత్తిని ప్రారంభించింది. 2010 లో ఐ యామ్ షీ-మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో రెండవ రన్నరప్ గా కిరీటాన్ని పొందింది. జీవా సరసన తమిళ చిత్రం `ముగమూడి`తో నటనారంగేట్రం చేసింది. నాగచైతన్యతో `ఒక లైలా కోసం`లో మొదటి తెలుగు చిత్రం. అఖిల్ సరసనా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లోను నటించిన పూజా మహేష్- ఎన్టీఆర్ - చరణ్ - ప్రభాస్ తదితర అగ్ర హీరోల సరసన నటించింది. అల వైకుంఠపురములో చిత్రంతో బుట్టబొమ్మగా తెలుగు వారి గుండెల్లో కొలువుంది. తెలుగు చిత్రసీమలో ఎదురేలేని కథానాయికగా హవా సాగిస్తోంది.
గ్లామర్ తో పాటు నట ప్రతిభతోను ఆకట్టుకుంటున్న పూజా ఒక్కో సినిమాకి రూ.3-4 కోట్ల పారితోషికం అందుకుంటోంది. తనను ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో 22.1 మిలియన్ల (2.21 కోట్ల) మంది ఫాలోవర్స్ అనుసరిస్తున్నారు. ప్రతిసారీ సూపర్ స్టైలిష్ లుక్ తో అభిమానులను ఆశ్చర్యపరచడంలో ఈ బ్యూటీ ఎప్పుడూ విఫలం కాలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్ మూవీలో పూజా నటిస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ సరసన బాలీవుడ్ లో భారీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రంలో నటిస్తోంది.