Begin typing your search above and press return to search.

ఆమె ఒంపుసొంపులు కిర్రాకే

By:  Tupaki Desk   |   2 March 2022 3:45 AM GMT
ఆమె ఒంపుసొంపులు కిర్రాకే
X
అందానికి అందం ప్ర‌తిభ దానికి తోడు కావాల్సినంత చొర‌వ ఉన్న క‌థానాయిక‌ల‌కు ఎదురుండ‌ద‌ని ప్రూవైంది. కియరా అద్వాణీ.. పూజా హెగ్డే లాంటి అందాల క‌థానాయిక‌లు ఇక్క‌డ హ‌వా సాగిస్తున్నారంటే దానివెన‌క ఎంతో ప‌రిణ‌తి దాగి ఉంది. ఇప్ప‌టికే ఈ భామ‌లిద్ద‌రూ ప‌రిశ్ర‌మ‌ల్ని ఏలేస్తున్నారు. పారితోషికంలోనూ కొండెక్కి కూచున్నార‌న్న టాక్ కూడా ఉంది.

ఇక‌పోతే నిరంత‌రం ఎంత కాంపిటీష‌న్ ఉన్నా దానిని ఎలా ఎదుర్కోవాలో కూడా ఈ భామ‌లే అంద‌రికీ నేర్పిస్తున్నారు. నిన్న‌టికి నిన్న కియ‌రా అద్వాణీ పింక్ బికినీలో ప‌రువాల్ని తెర‌ప‌రిచి కుర్ర‌కారు గుండెల్ని గుల్ల చేసింది.

ఇంత‌లోనే ఇదిగో ఇలా పూజా హెగ్డే కూడా పింక్ ట్రాక్ లో మ‌తులు చెద‌ర‌గొట్టింది. స్కిన్-టైట్ దుస్తులలో తన టోన్డ్ ఫిగర్ ని ప్రదర్శిస్తూ ప్ర‌త్య‌క్ష‌మైందిలా. బాడీ హ‌గ్ జిమ్ దుస్తులు ధరించడం ఇదే మొద‌టి సారి కాదు కానీ ఈ లుక్ లో పూజా ఒంపుసొంపులు ప‌ర్ఫెక్ట్ గా టోన్డ్ అయ్యి క‌నిపిస్తున్నాయి. పింక్ కలర్ జిమ్ దుస్తుల్లో కిర్రాకే అంటూ యూత్ అభినందిస్తున్నారు.

పూజా ఫిట్‌నెస్ ఫ్రీక్ .. గంటల తరబడి జిమ్ లో గడుపుతుంది. అంత హార్డ్ వ‌ర్కర్ కాబ‌ట్టే ఇలాంటి ఫిట్ నెస్ సాధ్య‌మైంది. ఒంపులు తిరిగిన దేహ‌శిరుల్ని ఎక్క‌డా బిగి స‌డ‌ల‌నివ్వ‌డం లేదు. ఇక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే పూజా న‌టించిన‌ రాధే శ్యామ్ ఈ నెల 11న విడుదల కానుంది. ఆమె తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ స‌ర‌స‌న‌ బీస్ట్ లో కూడా కనిపించనుంది. అలాగే అటు బాలీవుడ్ ప్రాజెక్టుల‌తోనూ పూజా బిజీగా ఉంది.