Begin typing your search above and press return to search.

ఆమెతో 'ఐకాన్‌' స్టార్‌ హ్యాట్రిక్‌ కాబోతుందా?

By:  Tupaki Desk   |   24 Aug 2021 6:03 AM GMT
ఆమెతో ఐకాన్‌ స్టార్‌ హ్యాట్రిక్‌ కాబోతుందా?
X
అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప పార్ట్‌ 1 సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పుష్ప పార్ట్‌ 2 కు ముందు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కోసం దర్శకుడు వేణు ఏర్పాట్లు చేస్తున్నాడు. వకీల్‌ సాబ్‌ వంటి భారీ కమర్షియల్‌ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ తో ఐకాన్ సినిమా ను వేణు శ్రీరామ్‌ చేయబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఐకాన్‌ సినిమా కోసం అల్లు అర్జున్‌ కాస్త తక్కువ సమయం ను ఇచ్చాడని.. పుష్ప 2 సినిమా కోసం వచ్చే ఏడాది లో డేట్లను కేటాయించాల్సి ఉంటుంది. అందుకే సాధ్యం అయినంత త్వరగా ఐకాన్ ను ముగించేయాల్సిందిగా దర్శకుడు వేణు శ్రీరామ్‌ మరియు నిర్మాత దిల్‌ రాజుతో అల్లు అర్జున్‌ అన్నాడు అంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అందుకే పుష్ప పార్ట్‌ 1 షూటింగ్‌ ముగించేప్పటి వరకు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ను ముగించి ఐకాన్‌ ను షూటింగ్‌ కు రెడీ చేయాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు చకచక పనులు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం హీరోయిన్ గా పూజా హెగ్డేను దాదాపుగా కన్ఫర్మ్‌ చేశారని తెలుస్తోంది.

ఇప్పటికే అల్లు అర్జున్‌ తో డీజే మరియు అల వైకుంఠపురంలో సినిమాల్లో పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే. ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా కూడా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంతో అంతా ఉన్నారు. ఐకాన్‌ లో కనుక అల్లు అర్జున్‌ మరియు పూజా హెగ్డేలు కలిసి నటిస్తే హ్యాట్రిక్ అంటూ అభిమానులు ధీమాతో ఉన్నారు. అల్లు అర్జున్‌ అల వైకుంఠపురంలో తర్వాత చేస్తున్న పుష్ప సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్‌ అవ్వడం ఖాయం అనే నమ్మకంతో అంతా ఉన్నారు. కనుక ఐకాన్ సినిమా తో మరో విజయాన్ని కూడా అల్లు అర్జున్ హ్యాట్రిక్‌ దక్కించుకుంటాడని.. తద్వారా ఐకాన్ తో రెండు హ్యాట్రిక్ లను బన్నీ దక్కించుకుంటాడనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. మరి ఈ విషయమై దిల్ రాజు కాంపౌండ్‌ నుండి మరింత స్పష్టత రావాల్సి ఉంది.