Begin typing your search above and press return to search.

ఫియ‌ర్ ఫ్యాక్ట‌ర్ ని దాచేసేందుకే పూజా ఇలా చేస్తోందా?

By:  Tupaki Desk   |   17 May 2021 2:30 PM GMT
ఫియ‌ర్ ఫ్యాక్ట‌ర్ ని దాచేసేందుకే పూజా ఇలా చేస్తోందా?
X
Prabhas movieఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా లైమ్ లైట్ లో ఉండ‌క‌పోతే లైట్ తీస్కుంటుంది ప‌రిశ్ర‌మ‌. అందుకే ఇటీవ‌లి కాలంలో స్టార్ హీరోయిన్లంతా త‌మ‌ను తాము వెలుగులో ఉంచుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. ఇటీవ‌ల డిజిట‌ల్ వేదిక‌ల‌పై అభిమానుల‌కు రెగ్యుల‌ర్ గా ట‌చ్ లో ఉండేందుకు వ‌రుస ఫోటోషూట్ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. ఇది స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌కు స్టూడియో ఓన‌ర్ల‌కు కాసులు కురిపిస్తోంది.

ఇక‌పోతే బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ఫియ‌ర్ ఫ్యాక్ట‌ర్ కి అతీతంగా క‌నిపించ‌డం లేదు. తాను ఎంత పెద్ద హీరోయిన్ అయినా కానీ ఏమాత్రం ఏమ‌రుపాటుగా ఉండేందుకు ఆస‌క్తిగా లేదు. అందుకే నిరంత‌రం ఏదో ఒక వేడెక్కించే ఫోటోగ్రాఫ్ ని అభిమానుల‌కు షేర్ చేస్తూ గుబులు పెంచుతోంది. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు ఎప్పుడూ ట‌చ్ లో ఉంటోంది.

తాజాగా షేర్ చేసిన‌ పూజా బ్యాక్ లెస్ ఫోజు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. పూజా గ్లామ‌ర‌స్ లుక్ యూత్ ని అదే ప‌నిగా హిప్న‌టైజ్ చేస్తోంది. అతి తక్కువ సమయంలో 12 లక్షలకు పైగా లైక్ లను ఆకర్షించిన ఈ ఫోటోకి పూజా ఎలాంటి క్యాప్షన్ ఇవ్వ‌లేదు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రాధే శ్యామ్ .. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల‌తో పూజా బిజీగా ఉంది. తమిళంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టిస్తోంది.