Begin typing your search above and press return to search.

అన్నదమ్ములతో సేవలు చేయించుకుంటున్న బుట్టబొమ్మ!

By:  Tupaki Desk   |   21 April 2020 5:00 PM GMT
అన్నదమ్ములతో సేవలు చేయించుకుంటున్న బుట్టబొమ్మ!
X
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌తో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే సెలబ్రిటీలు మాత్రం ఈ కాలాన్ని తమకు నచ్చినట్టుగా ఉపయోగించుకోవడం విశేషం. ఇంట్లో చేసే కొన్ని పనులను సోషల్‌ మీడియా రూపంలో అభిమానులతో పంచుకుంటూ వారిలో జోష్ నింపుతున్నారు. మీరూ ఇంట్లోనే ఉండండి. కరోనా నుంచి బయటపడేందుకు ఇదే మంచి మార్గం అంటున్నారు. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వంటింట్లో అడుగుపెట్టి కొత్త ఫుడ్ ఐటమ్స్ ఎలా వండాలో నేర్చుకుంటోందట. ఆ మధ్య హల్వా చేసి నెటిజన్లకు నోరూరించింది. ఇలా తీపి పదార్దాలు, పిజ్జాలు తింటూ క్వారంటైన్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అలాగే పనిలో పనిగా గిటార్ కూడా వాయించేస్తోందట.

పూజాహెగ్డే తాజాగా తన తండ్రి పుట్టినరోజు సెలెబ్రేట్ చేయడానికి కేక్‌ ను తయారు చేసిందట. అర్దరాత్రి సర్ ప్రైజ్ చేసి కేక్‌ను కట్ చేయించిందట. నాన్నకు ప్రేమతో పూజా చేసిన ఈ పని నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అంతేగాక ఇటీవలే పూజా హెగ్డే తన అన్నదమ్ములతో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పూజ అన్నదమ్ములు ఆమెను మహారాణిలా చూసుకుంటున్నారు. ఒకరు పూజకు హెడ్ మసాజ్ చేస్తుంటే.. మరొకరు కాళ్లు నొక్కుతున్నారు. ఈ వీడియోలో పూజ పట్ల తన కుటుంబ సభ్యుల ప్రేమ వ్యక్తమవుతోంది. మా కలలరాణి పూజను భద్రంగా చూసుకుంటున్నందుకు థాంక్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.