Begin typing your search above and press return to search.
నా అల్లుడు ఎలా ఉండాలంటే..!
By: Tupaki Desk | 16 May 2023 10:30 AM ISTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ పరంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటుంది. హిందీలో ఈ అమ్మడు సల్మాన్ ఖాన్ కు జోడీగా నటించిన కిసీ కా జాన్ కిసీ కీ భాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో ఈ అమ్మడు మళ్లీ సౌత్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం మహేష్ బాబుకు జోడీగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను పూజా హెగ్డే చేస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా మరో తెలుగు సినిమాలో కూడా ఈమె నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫ్లాప్స్ పడ్డా కూడా పూజా హెగ్డే మరి కొన్నాళ్లు హీరోయిన్ గా బిజీగానే ఉండే అవకాశాలు ఉన్నాయి.
తాజాగా పూజా హెగ్డే తన తల్లి లతతో కలిసి ఒక టాక్ షో లో పాల్గొంది. ఆ టాక్ షో లో పూజా హెగ్డే పెళ్లి గురించి ప్రముఖంగా మాట్లాడుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ప్రేమలో లేను అని.. పెళ్లి ఆలోచన కూడా లేదు అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. ఇక పూజా హెగ్డే కు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయమై ఆమె తల్లి లత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లత మాట్లాడుతూ.. పూజా చాలా సున్నిత మనస్కురాలు. తనను ప్రతి విషయంలో కూడా అర్థం చేసుకునే వ్యక్తి అయ్యి ఉండాలి. పెళ్లి బంధం లో భార్య భర్తలిద్దరి భాగస్వామ్యం ఉండాలి.. ఒకరి నిర్ణయాలను అభిరుచులను గౌరవించుకోవాలి. అవతలి వ్యక్తికి గౌరవం ఇవ్వని వారితో కలిసి జీవితం సాగించడం కష్టం అవుతుంది.
ఒకరిని ఒకరు గౌరవించుకోకుంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు. పూజ ప్రతి విషయంలో కూడా స్పష్టత కోరుకుంటుంది.. అలాగే జాగ్రత్తగా ఉండాలని ఆశ పడుతుంది. అందుకే అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు అయితే బాగుంటుంది. అతడు కెరీర్ ను ప్రోత్సహించడంతో పాటు పూజా మనసుకు నచ్చిన విధంగా గౌరవించాలని లత అన్నారు.
తన పెళ్లి విషయంలో అమ్మ లత చాలా క్లారిటీగా ఉన్నారని.. కనుక ఆమె నిర్ణయానుసారంగా తాను వెళ్తాను అన్నట్లుగా పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. తన జీవితంలో అమ్మే అన్నింటికి స్ఫూర్తి. కనుక ఆమె మార్గదర్శకంలో వెళ్తాను అంటూ పూజా హెగ్డే తన పెళ్లి విషయమై స్పష్టతనిచ్చింది.