Begin typing your search above and press return to search.

బుట్టబొమ్మకు అక్కినేని కోడలమ్మ అంటే కుళ్లు?

By:  Tupaki Desk   |   28 May 2020 10:30 AM GMT
బుట్టబొమ్మకు అక్కినేని కోడలమ్మ అంటే కుళ్లు?
X
పూజా హెగ్డే ఇన్స్టా ఖాతా నుండి నిన్న ఒక పోస్ట్ వచ్చింది. అందులో సమంతా ఫోటోకు "అంత ప్రెట్టీగా ఏం లేదు" అంటూ ఇంగ్లీష్ లో క్యాప్షన్ ఉంది. అయితే ఈ పోస్ట్ పెట్టిన తర్వాత కొన్ని గంటలకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని.. ఇన్స్టాలో వచ్చిన పోస్టులను పట్టించుకోవద్దని కోరింది. తన డిజిటల్ టీమ్ ఈ విషయంలో వర్క్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది.

కొంత సేపటి తర్వాత తన ఇన్స్టా ఖాతా మళ్లీ కంట్రోల్ లోకి వచ్చిందని వెల్లడించింది. తన డిజిటల్ టీమ్ కు కృతజ్ఞతలు చెప్తూ ఇప్పుడు అంతా ఓకే అని చెప్పింది. హ్యాకర్లను "థూ మీ బతుకు చెడ" అన్నట్టుగా ఇంగ్లీష్ లో తిడుతూ క్లారిటీ ఇచ్చింది. అయితే పూజ ఇన్స్టా ఖాతా నిజంగా హ్యాకింగ్ అయిందా అని కొందరు నెటిజన్లు అనుమానాలు లేవనెత్తుతున్నారు. సమంతాపై ఏదో నోరు జారి కామెంట్ పెట్టావు.. సమంతా అనే నీకు కుళ్లు అనే విషయం బయటపడిపోయింది.. ఇప్పుడు కవరింగ్ చేసుకుంటున్నావా అంటూ కొందరు పూజపై విమర్శలు గుప్పించారు. కొంతమంది అయితే ఈ విషయంపై మీమ్స్ పోస్ట్ చేస్తూ పూజను ట్రోల్ చేయడం కూడా ప్రారంభించారు.

నిజంగా పూజ ఈ పోస్ట్ చేసిందో లేక హ్యాకర్లు అలా చేశారో అనేది తెలియదు. అయితే ఎక్కువమంది మాత్రం "హ్యాకింగ్ కాదు.. పాడు కాదు ఇది పూజ కావాలని చేసింది" అంటున్నారు. ఈ వరస చూస్తుంటే.. ఇకపై ఏ సెలబ్రిటీ తన ఖాతా హ్యాకింగ్ అయింది అని చెప్తే నమ్మేలా లేరు. ఎవరైనా హ్యాకర్స్ మాంచి స్టార్ హీరో ఖాతా హ్యాక్ చేసి మియా మాల్కొవా పాలకోవా వీడియోలు పెడితే పరిస్థితి ఏమౌతుందో. అ కోవా వీడియోలు నేను పెట్టలేదు మొర్రో అన్నా ఒప్పుకోరేమో!