Begin typing your search above and press return to search.

పూజ రెస్పాన్స్ కు నెటిజన్స్ ఫిదా !

By:  Tupaki Desk   |   16 Jan 2020 1:30 AM GMT
పూజ రెస్పాన్స్ కు నెటిజన్స్ ఫిదా !
X
సినీ సెలబ్రిటీలను కలవాలని అందరికీ ఆశగానే ఉంటుంది. తమ అభిమాన తారలను కలిసి వారితో ఓ సెల్ఫీ తీసుకోవాలని సగటు ప్రేక్షకుడు ఆరాట పడుతుంటాడు. షూటింగ్‌ స్పాట్స్ - ఈవెంట్స్ ఇలా పలు సందర్బాల్లో సెలబ్రిటీలను కలవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఇక్కడ భాస్కర్‌ రావు అనే వ్యక్తి మాత్రం ఏకంగా 5 రోజులు ఫుట్‌ పాత్‌ పై పడిగాపులు గాసి చివరకు తన అభిమాన తార పూజా హెగ్డేను కలిశాడు.

అందాల తార పూజా హెగ్డే కోసం భాస్కర్‌ రావు చేసిన ఈ ప్రయత్నం హాట్ టాపిక్ అవుతోంది. తన కోసం భాస్కర్‌ రావు 5 రోజులపాటు నిరీక్షించిన విషయాన్ని స్వయంగా పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ మేరకు ఆయనతో మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. 5 రోజులుగా మీ కోసం రోడ్లపై పడుకున్నానని భాస్కర్‌ రావు చెప్పడంతో.. ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయకండి అని పూజా కోరింది. అవసరమనుకుంటే సోషల్‌ మీడియాలో మెసేజ్‌ చేస్తే రియాక్ట్ అవుతా అని చెప్పింది.

''నన్ను కలిసేందుకు ముంబై వచ్చి 5 రోజులపాటు వెయిట్‌ చేసినందుకు భాస్కర్‌ రావుకు థ్యాంక్యూ. ఈ విషయం నిజంగా నన్ను కదిలించింది.. కానీ నా అభిమానులు ఇలా ఇబ్బంది పడటం బాధ కలిగిస్తోంది. నా కోసం అభిమానులు ఇంతలా ఇబ్బంది పడటం నాకు ఇష్టముండదు. మీరు ఎక్కడున్నా.. మీ ప్రేమను, అభిమానాన్ని నేను పొందుతూనే ఉంటాను. మీరే నా బలం. లవ్‌ యూ ఆల్‌'' అని పూజా హెగ్డే పేర్కొంది.

మరోవైపు అల్లు అర్జున్‌- పూజా హెగ్డే కాంబినేషన్‌ లో వచ్చిన 'అల.. వైకుంఠపురములో' మూవీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ బన్నీ అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే గ్లామర్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.