Begin typing your search above and press return to search.

మొదటి సంపాదన గురించి పూజా హెగ్డే

By:  Tupaki Desk   |   24 Oct 2018 5:50 AM GMT
మొదటి సంపాదన గురించి పూజా హెగ్డే
X
టాలీవుడ్‌ లో మొదట నటించిన ‘ముకుందా’, ‘ఒక లైలా కోసం’ చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. ఆ రెండు చిత్రాల తర్వాత బాలీవుడ్‌ లో హృతిక్‌ రోషన్‌ కు జోడీగా మహోంజదారో చిత్రంలో నటించింది. ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయినా కూడా ‘డీజే’ చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా భారీ పారితోషికాలు అందుకుంటున్న ఈ అమ్మడు అందుకున్న మొదటి సంపాదన ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వక తప్పదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మొదటి సంపాదన - తన సినిమా ఎంట్రీ గురించి చెప్పుకొచ్చింది.

ఆ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ... నేను స్కూల్‌ లో ఉన్న సమయంలోనే నాకు మొదటి సంపాదన వచ్చింది. అది ఇచ్చింది మరెవ్వరో కాదు మా తాతగారు. నా చేతి రాత చాలా బాగుంటుందని అంతా అనేవారు - అందుకే ఒకసారి మా తాతగారు ముంబయి అథ్లెటిక్‌ అసోషియేషన్‌ లో పాల్గొన్న విద్యార్థుల పేర్ల జాబితాను రాయమన్నారు. ఆ జాబితాను తాను చాలా అందంగా రాశాను, నేను రాసిన లిస్ట్‌ ఆయనకు బాగా నచ్చడంతో అప్పుడే నాకు 200 రూపాయలు ఇచ్చారు. అదే నా నేను సంపాదించిన తొలి సంపాదనగా చెప్పుకుంటాను. ఆ రెండువందల రూపాయలు నా చేతికి వచ్చినప్పుడు నా ఆనందానికి అవదులు లేవు అంటూ తన తొలి సంపాదన గురించిన విశేషాలను చెప్పుకొచ్చి ముసిముసి నవ్వులు నవ్వింది.

ఇక సినిమాల్లో ఆఫర్‌ గురించి మాట్లాడుతూ.. కాలేజ్‌ డేస్‌ లో పెద్దగా అందంపై శ్రద్ద పెట్టేదాన్ని కాదు - కనీసం లిఫ్‌ స్టిక్‌ కూడా నేను పెట్టుకునే దాన్ని కాదు. అయినా కూడా నాకు మిస్‌ ఇండియా టాలెంటెడ్‌ లో పాల్గొనే అవకాశం దక్కింది. అక్కడ విజయం దక్కిన తర్వాత 2010 మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో రన్నరప్‌ గా నిలిచాను. అప్పటి నుండి నాపై నాకు నమ్మకం కలిగింది. ఆ సమయంలోనే పు కమర్షియల్‌ యాడ్స్‌ లో నటించాను. స్నేహితురాలి సలహా మేరకు సౌత్‌ సినిమాల్లో ఛాన్స్‌ ల కోసం ప్రయత్నాలు చేశాను, అప్పుడే తమిళంలో మొదటి సినిమా ఛాన్స్‌ దక్కింది. ఆ తర్వాత తెలుగులో కూడా ఛాన్స్‌ దక్కాయి.

బాలీవుడ్‌ లో నేను హృతిక్‌ రోషన్‌ తో చేసిన మహోంజదారో చిత్రంతో మంచి గుర్తింపును దక్కించుకున్నాను. ఒక యాడ్‌ లో నన్ను చూసి - చాలా బాగుందని - తమ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు సెట్‌ అవుతుందని హృతిక్‌ రోషన్‌ నాకు ఆ అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంతో నాకు బ్రేక్‌ వచ్చిందని పూజా పేర్కొంది. ప్రస్తుతం ఈమె ప్రభాస్‌ తో ఒక చిత్రంలో నటిస్తోంది. ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.