Begin typing your search above and press return to search.

పూజా తగ్గట్లేదుగా అసలు

By:  Tupaki Desk   |   11 Feb 2018 10:58 AM GMT
పూజా తగ్గట్లేదుగా అసలు
X
అంతకు ముందు ఏమో కాని అల్లు అర్జున్ డిజే సినిమాలో ఒక్క బికినీ సీన్ తోనే స్టార్ అయిపోయిన పూజా హెగ్డేకు గోల్డెన్ టైం రన్ అవుతోంది. గతంలో పేరున్న దర్శకుల సినిమాల్లోనే చేసినా టైం కలిసి రాక అన్ని ఫ్లాప్ అయిన పూజా ఒక దశలో ఐరన్ లెగ్ అని ముద్ర కూడా వేయించుకుంది. ముకుందా - ఒక లైలా కోసం ఫలితం అలాంటిది మరి. హిందీలో హృతిక్ రోషన్ పక్కన లాగాన్ లాంటి మాస్టర్ క్లాసిక్ తీసిన అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మొహెంజోదారో సైతం అట్టర్ ఫ్లాప్ కావడంతో కొంత సైలెంట్ అయిన పూజా హెగ్డే  ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో చేస్తున్న సాక్ష్యం ఫినిషింగ్ స్టేజిలో ఉండగా రంగస్థలంలో రామ్ చరణ్ సరసన ఒక ఐటెం సాంగ్ లో జిల్ జిగేల్ రాణిగా స్టెప్స్ కూడా వేసింది.

ఇవి కాకుండా మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబోలో దిల్ రాజు - అశ్వినిదత్ సంయుక్తంగా నిర్మించబోయే సినిమాలో కూడా తననే హీరొయిన్ గా ఎంచుకున్నారు. ఇది తనకు ఖచ్చితంగా మేజర్ బ్రేక్ అవుతుంది అని నమ్ముతోంది పూజా. భరత్ అనే నేను షూటింగ్ పూర్తి కాగానే ఇది సెట్స్ పైకి వెళ్తుంది. తనకి మేజర్ అసెట్ అయిన బాడీ విషయంలో పూజా హెడ్గే చాలా కేర్ తీసుకుంటోంది అని చెప్పడానికి పైన ఫొటోలే నిదర్శనం. పదునైన నడుము ఓంపులతో వెనక నుంచి కళ్ళు తిప్పుకోలేని ఫిట్నెస్ తో పూజా తాను ఎంత కష్టపడుతోందో చెప్పకనే చెబుతోంది. డిమాండ్ పీక్స్ లో ఉన్న పూజా బాడీపై ఈ మాత్రం శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం.