Begin typing your search above and press return to search.
మొహెంజొదారో చేదు జ్ఞాపకాల్ని మర్చిపోలేదింకా!
By: Tupaki Desk | 28 Jun 2022 5:52 AM GMTబుట్ట బొమ్మగా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే తన కెరీర్ లో ఉత్థాన పతనాల గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. కెరీర్ లో మొత్తం ఆరు వరుస అత్యుత్తమ విజయాలను అందుకున్నానని తెలిపిన పూజా హృతిక్ తో తన బాలీవుడ్ డెబ్యూ సినిమా మొహంజోదారో జ్ఞాపకాలను కూడా పంచుకుంది. ఈ సినిమా తన కెరీర్ లో చెత్త అని ప్రస్థావించింది. మొహంజోదారో ని లీస్ట్ మూవీగా అభివర్ణించింది.
హృతిక్ రోషన్ తో కలిసి చేసిన ఈ సినిమా తన కెరీర్ లో అత్యల్ప స్థానంలో ఉందని .. ఆ మూవీ వల్ల తనకు ఆ ఏడాది అవకాశాలు ఏవీ రాలేదని కూడా వెల్లడించింది. పూజా హెగ్డే చివరికి తెలుగులో తనను ఆదుకున్న సినిమా ఎలా వచ్చిందో కూడా వెల్లడించింది. ఆరంభ చిత్రం (ముకుంద)లో అవకాశం కమర్షియల్ గా క్లిక్ అయ్యిందని అప్పటి నుండి ఇది తనకు అద్భుతమైన రైడ్ గా మారిందని వెల్లడించింది.
ప్రముఖ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా ఈ సంగతులన్నీ వెల్లడించింది. ప్రతి చిత్రం దేనికదే ప్రత్యేకం.. దానికంటూ ఒక స్వీయ విధిరాత ఉంటుందని తాను భావిస్తానని పూజా తెలిపింది. అయితే ఒక చిత్రం బాగా ఆడినా ఆడకపోయినా కానీ భవిష్యత్తులో తాను మాత్రం ప్రభావితం కాకూడదనే ఉద్దేశ్యంతో తాను బాక్సాఫీస్ ఫలితానికి ఏ విధంగానూ అటాచ్ చేసుకోనని తెలిపింది. జయాపజయాలను ఖాతరు చేయనని కూడా అంది.
తన కెరీర్ లో ఇప్పటివరకు బెస్ట్ మూవీస్ గురించి లీస్ట్ మూవీ గురించి పాయింట్లను వివరిస్తూ వరుసగా ఆరు హిట్ చిత్రాలను కలిగి ఉండడం బెస్ట్ అని తెలిపింది. ఇది అద్భుతమైన అనుభూతి అని తెలిపింది. అయితే కెరీర్ ప్రారంభంలోనే తన లీస్ట్ పాయింట్ గురించి ప్రస్థావిస్తూ 'మొహంజోదారో' పేరును తెలిపింది. హిందీ డెబ్యూ 'మొహంజోదారో' ఫ్లాపయ్యాక ఆ ఏడాది అంతా తనకు పని లేదని కూడా తెలిపింది.
పూజా హెగ్డే తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గురించి చెబుతూ.. తాను చేయాలనుకున్న సినిమాలు తనవైపు వచ్చినా కానీ దురదృష్టవశాత్తు అవి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదని తెలిపింది. చివరికి కమర్షియల్ గా క్లిక్ అయిన పెద్ద మూవీ ఒకటి ఉందని తెలిపింది. అది బహుశా జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ చిత్రం గురించి ప్రస్తావించిందని భావించాలి.
అప్పటి నుండి పూజా తనకు అద్భుతమైన రైడ్ సాధ్యమైందని తెలిపింది. తాను ఇంకా చాలా దూరం వెళ్ళాలి అని అంది. ఎన్నో రకాల సినిమాలు చేయాలని తహతహలాడుతున్నానని.. చాలా మంది తన ఫేవరెట్ దర్శకులతో కలిసి పనిచేయాలనుకుంటున్నానని తెలిపింది.