Begin typing your search above and press return to search.
అరవింద గొంతు అతకలేదే!!
By: Tupaki Desk | 3 Oct 2018 7:25 AM GMTఎన్నో అంచనాలతో విడుదలైన అరవింద సమేత వీర రాఘవ ట్రైలర్ కు అభిమానుల నుంచి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. దీనికి కారణాలు వేర్వేరుగా ఉన్నప్పటి ఒక్క అంశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. అదే పూజా హెగ్డే స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం. పరిశ్రమకు వచ్చి ఆరేళ్లైనా పూజా హెగ్డే ఎప్పుడూ తన పాత్ర తనే డబ్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. మొదటిసారి తారక్ తో కలిసి చేసిన మూవీ కోసం ఆ ప్రయోగానికి ఓకే చెప్పేసింది. కానీ తన ఒరిజినల్ గొంతును వింటే పెదవి విరిచేలా ఉండటం గమనార్హం.
తెలుగు అమ్మాయి కాకపోవడంతో పాటు ఇప్పటిదాకా టాలీవుడ్ లో పూజా హెగ్డే చేసినవి నాలుగు సినిమాలే. ఇది ఐదోది. మరి ఇంత త్వరగా తెలుగులో స్వంతంగా గొంతు వినిపించాలని ఎందుకు అనుకుందో ఏమో కానీ అది అంతగా అతకలేదనే అభిప్రాయంతో ప్రేక్షకులు కూడా ఏకీభవిస్తున్నారు. నిజానికి ఎంత పెద్ద పాపులారిటీ ఉన్న హీరోయిన్ లైనా స్క్రీన్ కు సెట్ అయ్యేలా ఉంటే తప్ప గొంతునిచ్చే సాహసం చేయరు. సమంతా ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్ల తర్వాత మొదటిసారి యుటర్న్ తో డబ్బింగ్ చెబితే అంతగా కనెక్ట్ కాలేకపోయింది. విజయశాంతి దశాబ్దానికి పైగా కెరీర్ పూర్తయ్యాక ఒసేయ్ రాములమ్మతో మొదలుపెట్టారు. రమ్యకృష్ణ సైతం అంతే టైం స్పాన్ లో చంద్రలేఖతో తన గొంతుని వినిపించడం స్టార్ట్ చేసారు. రోజా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాకే ఆవిడ స్వరం ప్రేక్షకులకు తెలిసింది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరి పూజా హెగ్డే ఇంత త్వరగా డబ్బింగ్ చెప్పుకోవడం అటు యాస పరంగా గొంతులో లేని మాధుర్యం కృత్రిమంగా తెచ్చుకోవడం వల్ల మొత్తానికి తేడా కొట్టించింది. ఇప్పటికే పూర్తి వెర్షన్ ఫినిష్ చేసారో లేక ఈ రెండు మూడు రోజుల్లో నిర్ణయం మార్చుకుని వేరవాళ్ళతో చెప్పిస్తారో రిలీజయ్యాకే తెలుస్తుంది.