Begin typing your search above and press return to search.

దీపాల వెలుగుల్లో మన సినీ సెలెబ్రెటీలు.. ఎవరంటే?

By:  Tupaki Desk   |   6 April 2020 5:30 PM GMT
దీపాల వెలుగుల్లో మన సినీ సెలెబ్రెటీలు.. ఎవరంటే?
X
ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేశారు మన టాలీవుడ్ సెలెబ్రెటీలు.. కరోనాపై యుద్ధంలో మద్దతుగా నిలిచారు. కరోనాపై పోరాడుతున్న వారికి మద్దతు తెలుపడానికి ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం రాత్రి దీపాలు వెలిగించాలని కోరిన సంగతి తెలిసిందే. దీనికి మద్దతుగా టాలీవుడ్ సెలెబ్రెటీలంతా దీపాలు వెలిగించారు.

చాలా మంది ఇంటి బయట, బాల్కనీ, ఇళ్లలో దీపాలు వెలిగించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వారి ఫొటోలు వైరల్ గా మారాయి. చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, అర్జున్ ఫ్యామిలీ, రాజశేఖర్ కుటుంబ సభ్యులందరూ వారి ఇళ్లలో కుటుంబ సమేతంగా దీపాలు వెలిగించి కనిపించారు.

ఇక స్టార్ హీరోలు మహేష్ బాబు, వెంకటేశ్, కార్తికేయ తదితరులు సింగిల్ గా చేతిలో కొవ్వొత్తులు పట్టుకొని కనిపించారు.

ఇక హీరోయిన్లు తమన్నా, పూజా హెగ్డే, ఈషా రెబ్బా, పాయల్ రాజ్ పుత్ తదితరులు బాల్కనీలో దీపాలు వెలిగించి ఫొటోల్లో కనిపించారు.

నిన్న రాత్రి9 గంటలకు వీరంతా దీపాల వెలుగుల్లో కనిపించి తమ మద్దతును తెలిపారు. ఇప్పుడు సినీ సెలెబ్రెటీల ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మోడీ మాటకు విలువనిచ్చి కరోనాపై యుద్ధంలో పోరాడుతున్న వారికి సినీ హీరోలు, ప్రముఖులు దాదాపు అందరూ దీపాలతో మద్దతు పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది.