Begin typing your search above and press return to search.

బన్నీ.. హీరోయిన్స్ ను ఎందుకు రిపీట్ చేయవని అడిగిందట!

By:  Tupaki Desk   |   15 Jan 2020 8:30 AM GMT
బన్నీ.. హీరోయిన్స్ ను ఎందుకు రిపీట్ చేయవని అడిగిందట!
X
కొన్ని మాట్లాడుకోవటానికి బాగుంటాయి. అలా మాట్లాడుకునే మాటల్ని.. నేరుగా అడిగేయటం అంత ఈజీ కాదు. అలాంటి పనే తాను చేసినట్లుగా చెప్పిన పూజా హెగ్డే మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఆమె నటించిన అల వైకుంఠపురములో ఎంతగా హిట్ అయ్యిందో తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో అదిరే టాక్ తో దూసుకెళుతునన వేళ.. పూజా హెగ్డే కొన్ని మీడియా సంస్థలతో ప్రత్యేకంగా మాట్లాడింది.

ఈ సందర్భంగా ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చింది. అందులో ఒకటి.. అల్లు అర్జున్ తాను ఎవరైనా హీరోయిన్ తో ఒక సినిమా చేస్తే.. మళ్లీ అదే హీరోయిన్ తో సినిమా చేయటం కనిపించదు. దాన్ని బ్రేక్ చేసింది పూజా హెగ్డే ఒక్కరే. డీజేలో బన్నీతో చేసిన ఆమె.. అల.. చిత్రంలో చేసింది. ఎప్పుడూ హీరోయిన్స్ ను రిపీట్ చేయని బన్నీ తొలిసారి పూజా హెగ్డేతో మాత్రం రెండో సినిమా చేశారు.

ఈ అంశం మీద ఇప్పటికే చాలానే చర్చ నడుస్తోంది. అందరూ మాట్లాడే మాటల్నే.. సినిమా చేస్తున్న వేళ తాను బన్నీని అడిగినట్లుగా పూజాహేగ్డే చెప్పారు. నువ్వు ఎందుకు హీరోయిన్స్ ను రిపీట్ చేయవని తాను కూడా అల్లు అర్జున్ ను ఏడిపించినట్లు చెప్పిన పూజా.. దానికి బన్నీ ఎలా రియాక్ట్ అయ్యారో మాత్రం చెప్పలేదు. కాకుంటే.. డీజేలో తమ కెమిస్ట్రీకి మంచి స్పందన రావటంతో తనను తీసుకున్నారేమోనని చెప్పింది.

ఫన్నీ స్క్రిప్ట్ చేయాలనుకోవటం.. త్రివిక్రమ్ సర్ తో మళ్లీ చేసే అవకాశాన్ని వదులుకోకూడదనుకోవటం.. బన్నీ సినిమా కావటంతో ఈ చిత్రాన్ని చేసినట్లుగా చెప్పింది పూజా. అంతేకాదు.. ఈ సినిమాలో తన పాత్ర చాలా బలంగా ఉండటంతో వెంటనే ఓకే చెప్పానని పేర్కొంది. పూజా లెక్కలు ఎలా ఉన్నా.. కొత్త సంవత్సరంలో చక్కటి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పక తప్పదు.