Begin typing your search above and press return to search.
సానియా మీర్జా బయోపిక్ లో?
By: Tupaki Desk | 28 Sep 2018 4:17 AM GMTక్రీడా నేపథ్యం ఉన్న బయోపిక్ లు నటీనటుల మైలేజ్ ని అమాంతం పెంచేస్తున్నాయనడంలో సందేహం లేదు. మేరీకోమ్ - సచిన్ - ధోని బయోపిక్ లే అందుకు ఎగ్జాంపుల్. ఆయా సినిమాల్లో లైఫ్ లో ఎమోషన్ ని ఆడియెన్ వోన్ చేసుకున్నారు. స్ఫూర్తిగా భావించారు. అందువల్ల బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. అందుకే ఇప్పుడు క్రీడాకారుల బయోపిక్ ల వెల్లువ అంతకంతకు పెరుగుతోంది. ఇటీవలే బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ బయోపిక్ ప్రారంభమైంది. సైనా పాత్రలో శ్రద్ధా కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రఖ్యాత టీసిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఆ క్రమంలోనే పలువురు క్రీడాకారిణుల బయోపిక్ లు తీసేందుకు ఫిలింమేకర్స్ ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా హైదరాబాదీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా - క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లు తెరకెక్కించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ తరహా బయోపిక్ లలో నటించేందుకు ముంబై బ్యూటీ పూజా హెగ్డే ఆసక్తి చూపించడం విశేషం. ఇటీవలే ఓ చిట్ చాట్ లో పూజా మాట్లాడుతూ-``సానియా - మిథాలీ రాజ్ బయోపిక్ లు తీస్తే నటించాలన్న ఆసక్తి ఉంది`` అని వెల్లడించారు. క్రీడాకారులు - అథ్లెట్ల బయోపిక్ లు చేస్తానని తెలిపారు. పూజా బాడీ లాంగ్వేజ్ అథ్లెటిక్ తరహా కాబట్టి అందకు సూటవుతుందనడంలో సందేహమే లేదు.
ప్రస్తుతం ఈ ముంబై బ్యూటీ వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఎన్టీఆర్ - అరవింద సమేత - మహేష్ - మహర్షి చిత్రాలతో బిజీ. తదుపరి ప్రభాస్- జిల్ రాధాకృష్ణ కాంబినేషన్ మూవీ సెట్స్ కి వెళ్లనుంది. క్రీడాకారిణుల జీవితకథల్లో నటించాలన్న ఆసక్తి కేవలం ముంబై భామల్లోనే కాదు తెలుగమ్మాయిల్లోనూ ఉంది. చాందిని - యామిని భాస్కర్ లాంటి తెలుగమ్మాయిలు క్రీడాకారిణుల బయోపిక్ లలో నటించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని ఇదివరకూ ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.