Begin typing your search above and press return to search.

నిఖార్సైన హిట్ లేదు.. ఫీజు మాత్రం పీక్స్!

By:  Tupaki Desk   |   25 Sep 2019 1:30 AM GMT
నిఖార్సైన హిట్ లేదు.. ఫీజు మాత్రం పీక్స్!
X
రెమ్యూనరేషన్ అనేది ఎప్పుడూ డిమాండ్ మీదే ఆధారపడి ఉంటుంది. హీరోయిన్ల విషయంలో అది ఇంకా ఎక్కువ. టాలీవుడ్ విషయమే తీసుకుంటే హీరోలు అరవై ఏళ్ళ వరకూ హీరో పాత్రలే వేస్తారు.. కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేస్తారు. కానీ హీరోయిన్ల పరిస్థితి అలా ఉండదు కదా. కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే డిమాండ్ ఉన్నప్పుడే హీరోయిన్లు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పూజా హెగ్డే కూడా అదే బాటలో ఉందట.

పూజా హెగ్డే కెరీర్లో ఇంతవరకూ సాలిడ్ గా హిట్ అనేది లేదు. అయినా డిమాండ్ మాత్రం పీక్స్ లో ఉంది. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'.. ప్రభాస్ 'జాన్' సినిమాల్లో పూజా హెగ్డే హీరోయిన్. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులే. దీన్ని బట్టే పూజ డిమాండ్ ఎలా ఉందో మనకు అర్థం అవుతుంది. పూజ రెమ్యూనరేషన్ ప్రస్తుతం రూ. 1.5 కోట్ల నుండి 2 కోట్ల వరకూ ఉందట. ఈ రెమ్యూనరేషన్ పూజకు ఎక్కువని ఇండస్ట్రీలో కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి కానీ ఫిలింమేకర్లకు పెద్దగా ఇతర ఆప్షన్లు లేకపోవడంతో పూజానే తీసుకుంటున్నారట.

శ్రియ.. కాజల్.. తమన్నా లాంటి హీరోయిన్లు మరీ సీనియర్ బ్యాచ్ కావడం.. సమంతాకు వివాహం కావడం.. స్టార్ హీరోల ఇమేజ్ ను మ్యాచ్ చేసే రేంజ్ లో కొత్త హీరోయిన్లు లేకపోవడంతో ఫిలిం మేకర్ల దగ్గర ఎక్కువ ఛాయిస్ ఉండడంలేదు. అదే ఈ బ్యూటీకి ప్లస్సుగా మారింది. అయినా నిఖార్సైన హిట్టు ఒక్కటీ లేని ఈ భామకు కోటిన్నర.. రెండు కోట్ల రెమ్యూనరేషన్ ఎక్కువ కాదా? మనవాళ్ళు హిట్స్ లేని హీరోయిన్లను వెతికి మరీ ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారేమో మరి!