Begin typing your search above and press return to search.
కాళ్ళ లవ్ ట్రాక్ పై స్పందించిన పూజ
By: Tupaki Desk | 15 Jan 2020 11:30 AM GMTఈ సంక్రాంతికి రిలీజ్ అయిన పెద్ద సినిమాల్లో అల్లు అర్జున్ -త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో 'అల వైకుంఠపురములో' ఒకటి. సినిమాకు పాజిటివ్ టాక్ తో పాటుగా మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. వసూళ్లు కూడా దుమ్ము లేపుతున్నాయి. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఆరంభం అయ్యేది కాళ్ళ దగ్గర. మోడరన్ డ్రెస్సులు.. చిట్టిపొట్టి స్కర్టులు వేసుకునే పూజ అందమైన లెగ్స్ చూసి అల్లు అర్జున్ మనసు పారేసుకుంటాడు. సామజవరగమన అనే సూపర్ హిట్ పాటేసుకుంటాడు. ఇది అందరికీ నచ్చింది కానీ కొందరు గుడ్డు మీద ఈకలు పీకే బ్యాచ్ కు అస్సలు నచ్చలేదు.
ఈ ఈకల బ్యాచ్ కు కావలసింది అబ్బ జబ్బ దబ్బ. అంటే ఏకంగా బట్టలు విప్పుకుని హీరో హీరోయిన్లు ఒకరికి ఒకరు థాయ్ మసాజ్ చేసుకోవాలి. వీలైతే ఆహా ఊహూ.. ఆ.. అంటూ నేపథ్య సంగీతంతో కూడా ప్రేక్షకులను చంపేయాలి. అప్పుడే బోల్డ్ అని.. ట్రెండ్ అని.. బ్యూటిఫుల్ అని.. ఇదంతా క్రియేటివ్ ఫ్రీడమ్ అని సరిపెట్టుకుంటారు. అంతే కానీ కాళ్ళు - కళ్ళు చూపిస్తే అందులో మాత్రం బూతు ధ్వనిస్తుంది. ఏదైతేనేం ఈ విమర్శలు పూజకు తెలియడంతో క్లారిటీ ఇచ్చింది.
"లవ్ ట్రాక్ మొదలయ్యేది కాళ్ళ దగ్గరే కానీ తర్వాత అమ్మాయి కళ్ళతో ప్రేమలో పడతాడు. కొన్ని సినిమాలలో హీరోయిన్ బొడ్డును అదేపనిగా చూపిస్తారు. అయితే అల వైకుంఠపురములో సినిమాలో అలాంటిది ఉండదు. ఆఖరికి పాటలో కూడా అమ్మాయి ఎంత అందంగా ఎంత చక్కగా నడుస్తుందనేది ఉంటుంది కానీ అభ్యంతరకరంగా ఉండదు" అంటూ సమర్థించుకుంది. గురూజీ తన మ్యాజికల్ పెన్నుతో రాసినట్టుగా.. అల్లు అర్జున్ ఎంతో స్టైలిష్ చెప్పినట్టుగా.. పూజ చెప్పినదానికి 'జస్ట్ సరెండర్ అయిపోవాలి అంతే'.