Begin typing your search above and press return to search.

గురూజీ అంటే బుట్ట‌బొమ్మ‌కి ఎందుకంత ప్రేమ‌?

By:  Tupaki Desk   |   7 Nov 2020 12:30 PM GMT
గురూజీ అంటే బుట్ట‌బొమ్మ‌కి ఎందుకంత ప్రేమ‌?
X
గురూజీ త్రివిక్ర‌మ్ వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రో క‌థానాయిక‌లు అగ్ర‌ప‌థానికి చేరారంటే అతిశ‌యోక్తి కాదు. త‌న సినిమాల్లో ఉమెన్ సెంట్రిక్ అనే ఎలిమెంట్ తో బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్యామిలీ ఆడియెన్ నుంచి కాసుల్ని రాబ‌డుతున్నారు. అందుకే ఆయ‌న సినిమాల‌న్నీ ఇండ‌స్ట్రీ ఆల్ టైమ్ రికార్డుల్ని తిర‌గ‌రాస్తున్నాయి. అలాగే త్రివిక్ర‌మ్ సినిమాల్లో న‌టించిన క‌థానాయిక‌కు బాపు బొమ్ముగానూ పేరు ప్ర‌ఖ్యాతులు ద‌క్కుతున్నాయి.

అందుకు పూజా హెగ్డే.. స‌మంత వంటి నాయిక‌లు పెద్ద ఎగ్జాంపుల్. ఇంత‌కుముందు స‌మంతకు అత్తారింటికి దారేది.. అఆ.. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి లో అద్భుత‌మైన పాత్ర‌ల్లో న‌టించే అవ‌కాశం క‌ల్పించాడు. అవ‌న్నీ త‌న‌కు కెరీర్ ప‌రంగా పెద్ద మైలేజ్ ని ఇచ్చాయి. ఇటీవ‌ల పూజా హెగ్డేకి వ‌రుస‌గా త‌న సినిమాల్లో అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. అర‌వింద స‌మేత‌-అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాల్లో పూజాకి ఛాన్సిచ్చారు గురూజీ. అల వైకుంఠ‌పుర‌ములో ఇండ‌స్ట్రీ రికార్డ్ హిట్ చిత్రంగా నిలిచింది.

త‌న‌కు ఇంత‌టి చ‌క్క‌ని అవ‌కాశం క‌ల్పించిన గురూజీకి పూజా ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటుంది. నేడు త్రివిక్ర‌మ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా బుట్ట‌బొమ్మ పూజా ఎంతో ఎమోష‌న్ కి గురైంది. ``చక్కని.. ప్రశాంతమైన అత్యంత మనోహరమైన త్రివిక్రమ్ సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అరవింద .. అమూల్యగా ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు .. మీరు AVPL ను వివరించినప్పుడు ఇప్పటికీ గుర్తుంది. నవ్వడం ఆపలేక‌పోయాను. మీకు మంచి సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను``అని అంది. నేను చెప్పగలిగేది “గురూజీ సార్.. గురూజీ ఆంతే” అంటూ పూజా కాస్త స‌ర‌దాగా మాట్లాడేసింది. ఆయ‌న‌తో ఆన్ లొకేష‌న్ ఫోటోని షేర్ చేసి.. క‌న్ను గీటుతున్న ఒక ఈమోజీని . దండం పెడుతున్న ఈమోజీని స‌ర‌దాగా ఫన్ కోసం షేర్ చేసింది పూజా. పూజా ప్ర‌స్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ .. రాధే శ్యామ్ చిత్రాల్లో న‌టిస్తోంది.